Mahesh Babu: గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తోంది.ఇలా ఒక హీరో గురించి మరొక హీరో అభిమానులు విమర్శలు చేస్తూ వారి అభిమాన హీరోలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలైన సమయంలో మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ సినిమా గురించి ట్రోలింగ్ చేశారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేష్ బాబు సినిమా విడుదల కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా గురించి తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు. సినిమా విడుదలైన మొదటి రోజు మొదటి షో నుంచి సినిమా డిజాస్టర్ అంటూ ట్రెండ్ చేశారు. ఇలా ఈ సినిమా గురించి నెగటివ్ కామెంట్లు చేస్తూ ఏకంగా సినిమా ఫ్లాప్ అంటూ ట్రోల్ చేశారు. మహేష్ బాబు తన సినిమాలో జగన్ డైలాగ్ పెట్టుకోవడం వల్ల సినిమా ఎత్తిపోయింది అంటూ కూడా కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇక తన జనసేన పార్టీ గుర్తు గ్లాస్ అని కూడా అందరికీ తెలుసు.

Mahesh Babu: మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో..
మహేష్ బాబు గ్లాస్ లో టీ తాగుతూ కనిపిస్తారు.ఈ క్రమంలోనే ఈ సన్నివేశం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ పెట్టారా? అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు గ్లాస్ గురించి చిరాకుపెట్టే డైలాగ్స్ కూడా పెట్టారు. దీంతోఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ పెట్టారు అంటూ కొందరు ట్రోల్ చేయగా వెంటనే పవన్ అభిమానులు అందుకే మహేష్ సినిమా దొబ్బింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి హీరోల మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం వీరి మధ్య శత్రుత్వాన్ని రాజేస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.