Mahesh Babu: అబ్బో.. మహేష్ బాబు సీక్రెట్ ను బయట పెట్టడానికి ప్రయత్నించిన బాలీవుడ్ బ్యూటీ!

Akashavani

Mahesh Babu: సినీ లవర్స్ కి బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ దబాంగ్ త్రీ లో హీరోయిన్ అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పడతారు. ఆ సినిమాతోనే ఈ అమ్మడు బాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇటీవల టాలీవుడ్ లో వరుణ్ తేజ్ గని సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టక తప్పలేదు. ఈ సినిమాలో వరుణ్ సిక్స్ ప్యాక్, పవర్ ప్యాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అంతగా మెప్పించలేకపోయాడు. కాగా ఈ ఈ అమ్మడికి టాలీవుడ్లో తొలి సినిమా బెడిసి కొట్టిందనే చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు నిర్మిస్తున్న మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కాగా ఈ సినిమాలో అడవి శేష్ సరసన సయీ మంజ్రేకర్ మెప్పించ బోతుతుంది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో సయీ ఈటీవీ షో కి వచ్చి ఒక రేంజ్ లో హడావిడి చేసింది. తనకొచ్చిన కొంచెం కొంచెం తెలుగు తో ముద్దుముద్దుగా జవాబులు ఇచ్చేసింది. ఈ క్రమంలో సయీ కి మీ తర్వాతి సినిమాలో మహేష్ బాబుని నన్ను హీరోయిన్ గా పెట్టుకోమని అడగలేదా అన్న ప్రశ్న ఎదురవుతుంది.

Mahesh Babu: అబ్బో.. మహేష్ బాబు సీక్రెట్ ను బయట పెట్టడానికి ప్రయత్నించిన బాలీవుడ్ బ్యూటీ!
Mahesh Babu: అబ్బో.. మహేష్ బాబు సీక్రెట్ ను బయట పెట్టడానికి ప్రయత్నించిన బాలీవుడ్ బ్యూటీ!

Mahesh Babu: సయీ మంజ్రేకర్ మహేష్ లో దీనికి గల సీక్రెట్ అడిగింది!

దీనికి సయీ మాట్లాడుతూ.. మహేష్ బాబు కనిపించగానే నేను ముందు ఆయన అందం వెనుకున్న సీక్రెట్ ఏమిటి? అని అడిగానని ఆ ముద్దుగుమ్మ వెల్లడించింది. నిజానికి ఈ ముద్దుగుమ్మ అడగడం కరెక్టే.. దాదాపు నాలుగు పదుల వయసు దాటినప్పటికీ మహేష్ గ్లామర్ పరంగా మరింత వెలుగుతూ కనిపిస్తున్నాడు.

ఇక తొలి సినిమాతోనే పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సయీ అడవి శేషు తో కలిసి మేజర్ సినిమాలో తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

- Advertisement -