Mahesh Babu: ఒళ్ళు వంచడు.. షర్ట్ నలగదు.. ఎప్పుడు చూసిన ఒకటే ఎక్షప్రెషన్.. మహేష్ పై కామెంట్స్!

Akashavani

Mahesh Babu: మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన మిశ్రమ స్పందన దక్కించుకుంది. సినిమా ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ కొందరు కావాలనే ఈ సినిమా పై దుష్ప్రచారం చేస్తున్నారని మహేష్ బాబు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విధంగా ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు మెగాస్టార్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధం నడుస్తోంది. ఒక హీరో సినిమాల గురించి మరొక హీరోలు నెగిటివ్ కామెంట్లు చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమాల గురించి మెగా అభిమానులు దారుణమైన కామెంట్ చేస్తున్నారు.

మహేష్ బాబు ఎప్పుడో అవుట్ రేస్ లో ఉన్నారని ఏదో అలా సినిమాలను లాక్కోస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున మహేష్ బాబు పై మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో సినిమాలలో నటించిన మహేష్ బాబు ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్స్, ఆయన షర్టు నలగదు, ఒళ్ళు వంచడు. ఇక మహేష్ బాబు సినిమాలలో చూడ్డానికి ఏముంటుంది అంటూ పెద్ద ఎత్తున మెగా అభిమానులు మహేష్ బాబు సినిమా పై కామెంట్లు చేయగా ఈ కామెంట్ పై మహేష్ అభిమానులు స్పందిస్తూ మెగా అభిమానులకు కౌంటర్ వేశారు.

Mahesh Babu: ఒళ్ళు వంచడు.. షర్ట్ నలగదు.. ఎప్పుడు చూసిన ఒకటే ఎక్షప్రెషన్.. మహేష్ పై కామెంట్స్!
Mahesh Babu: ఒళ్ళు వంచడు.. షర్ట్ నలగదు.. ఎప్పుడు చూసిన ఒకటే ఎక్షప్రెషన్.. మహేష్ పై కామెంట్స్!

Mahesh Babu: మహేష్ బాబు క్రేజ్ అది..

ఈయన షర్టు నలగకపోయినా, ఒళ్ళు వంచకపోయినా, ఎక్స్ ప్రెషన్స్ లేకపోయినా ఆచార్య సినిమా రెండు మూడు రోజులకే కలెక్షన్లు చతికిలపడి పోయాయి. అయితే మహేష్ బాబు నైజాం ఏరియాలో ఆచార్య కలెక్షన్లను ఒకరోజు అడ్వాన్స్ బుకింగ్ లో మహేష్ బాబు లేపేసారు.అయినా జనాలకు మహేష్ బాబు అంటే ఎందుకంత క్రేజ్ అంటూ మహేష్ అభిమానులు ఈ సినిమా ఫ్లాప్ గురించి ప్రస్తావిస్తూ మెగా అభిమానులకు కౌంటర్ వేస్తున్నారు.అదేవిధంగా ఆచార్య సినిమా థియేటర్లో ప్లాప్ కావడంతో నిర్మాతలు అతి తక్కువ సమయంలోనే ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు కూడా మహేష్ అభిమానులు మెగా అభిమానులకు గట్టిపోటీ ఇస్తూ పెద్ద ఎత్తున కామెంట్ పెడుతున్నారు.

- Advertisement -