Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పనులలో బిజీ కానున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబుకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ ఈయనకు ఇండస్ట్రీలోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదట. సినిమాలంటేనే ఇష్టం లేనటువంటి ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి ఇలా స్టార్ హీరోగా మారిపోయారు. అసలు మహేష్ బాబుకి సినిమాలు అంటే ఎందుకు ఇష్టం లేదు మరి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అనే విషయానికి వస్తే ఈయన సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన సంగతి మనకు తెలిసిందే. అయితే హీరోగా కంటే పలు సినిమాలలో బాల నటుడిగా కూడా నటించారు. ఇలా బాల నటుడిగా గుర్తింపు పొందినటువంటి మహేష్ బాబు అనంతరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
డాక్టర్ కావాలనుకున్నారా…
ఇక చిన్నప్పటినుంచి మహేష్ బాబుకి డాక్టర్ కావాలి అనే ఒక కోరిక ఉండేదట అందుకే తాను కూడా ఎప్పుడు నేను డాక్టర్ అవుతాను అంటూ ఇంట్లో చెబుతూ ఉండేవారు అయితే తన తండ్రి కృష్ణ హీరోగా సినిమా షూటింగ్లకు అప్పుడప్పుడు మహేష్ బాబుని తీసుకు వెళ్లేవారు. అక్కడ కృష్ణ గారిని మేకప్ వేసుకొని చూడటం ఆయనకు ఇచ్చే రెస్పెక్ట్ అలాగే ఆ షూటింగ్ లోకేషన్ అంతా కూడా ఈయనకు బాగా నచ్చడంతో తన నిర్ణయం మార్చుకొని తాను కూడా సినిమాలలోకి రావాలని అనుకున్నారట. ఈ విధంగా డాక్టర్ కావలసిన మహేష్ బాబు యాక్టర్ అయ్యారని తెలుస్తోంది.ఇక ఈయన డాక్టర్ అయి ఉంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడి వారికి పునర్జన్మ ఇచ్చేవారు కానీ యాక్టర్ అయినప్పటికీ కూడా ఎంతోమంది చిన్నారుల గుండె ఆపరేషన్లు చేయిస్తూ వారికి పునర్జన్మను కల్పిస్తూ పరోక్షంగా తన కల నెరవేర్చుకుంటున్నారని చెప్పాలి.