Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయనకు ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకు తెలిసిందే. ఎంతో సింపుల్ గా ఉంటూనే అందరి మన్ననలు పొందిన మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ హీరో సినిమా విడుదలైన వెంటనే ఆ సినిమాలు చూస్తూ ఆ సినిమాల పై తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను తెలియ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట విషయంలో మాత్రం ఇలా జరగలేదు.
తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీ విడుదల అయింది.ఈ క్రమంలోనే ఈ సినిమా మొదట్లో మిశ్రమ స్పందన లభించినప్పటికీ వసూళ్ళ పరంగా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమా గురించి మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పిన జగన్ డైలాగ్ అద్భుతంగా పేలిందని చెప్పాలి. అయితే మహేష్ బాబు సినిమా పై టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం సైలెంట్ గా ఉండడం అందరిని విస్మయానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు గతంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన RRRసినిమాల గురించి స్పందించి వాటికి రివ్యూ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

Mahesh Babu: విస్మయానికి గురి చేస్తున్న హీరోల తీరు…
మహేష్ బాబు సినిమా విడుదలైన తర్వాత ఈ హీరోలు ఒక్కరు కూడా తన సినిమా గురించి రివ్యూ ఇవ్వకపోవడం గమనార్హం. ఇలా టాలీవుడ్ హీరోలు అందరూ మూకుమ్మడిగా మహేష్ బాబు సినిమాని పూర్తిగా పక్కన పెట్టారు.ఈ విధంగా ఇతర హీరోల సినిమాలకు సోషల్ మీడియా వేదికగా స్పందించి ట్వీట్లు చేసిన మహేష్ బాబు తన సినిమా కోసం ఏ ఒక్క హీరోలు కూడా స్పందించకపోవడంతో ఆయన అభిమానులు ఇతర హీరోల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే మరికొందరు మహేష్ బాబు జగన్ డైలాగ్ ఉపయోగించినందుకే టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనను పక్కన పెట్టారంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు సర్కారు వారి పాట గురించి ఏ ఒక్క హీరో కూడా నోరు మెదపకపోవడం మహేష్ అభిమానులను తీవ్ర విస్మయానికి గురి చేస్తోంది.