Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికీ సుపరిచితమే కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా అడుగుపెట్టిన మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ వృత్తిపరమైన జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోను ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేష్ బాబు అందరి హీరోల మాదిరిగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారి ఇళ్లలో ఫంక్షన్ కి పెళ్లిళ్లకు పెద్దగా బయట ఎక్కడ కనిపించరు. ఈయన కేవలం తన ఫ్యామిలీ ఫంక్షన్లకు మాత్రమే హాజరవుతూ ఉంటారు. ఇలా మహేష్ బాబు తన సినిమా వేడుకలకు మినహా ఇతరుల సినిమా వేడుకలలో కూడా కనిపించరు. ఇలా మహేష్ బాబు పెద్దగా బయట ఫంక్షన్లకు హాజరు కాకపోవడానికి ఓ కారణము ఉందని తెలుస్తుంది. కేవలం కుటుంబ ఫంక్షన్లకు మాత్రమే మహేష్ బాబు హాజరయ్యి ఇతరుల ఫంక్షన్లకు హాజరు కాకపోవడానికి కారణం మొహమాటం అని తెలుస్తుంది.
Mahesh Babu:
మహేష్ బాబు చాలా కూల్ గా ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారట. ఈయనకు ఎలాంటి హాంగు ఆర్భాటాలు హడావుడి ఏమాత్రం నచ్చదు అందుకే ఎలాంటి ఫంక్షన్లకి కూడా ఈయన హాజరుకారు. ఇక తప్పనిసరి పరిస్థితులలో వెళ్లాల్సి వచ్చిన తన పని తాను చేసుకొని వెంటనే వెళ్లి పోతూ ఉంటారు.అది కూడా నమ్రత బలవంతం మీదే వస్తారని ఆయన ఇష్టంగా మాత్రం రారని తెలుస్తుంది. ఇక మహేష్ బాబుకి ఈ మొహమాటం అనే జబ్బు ఉండటం వల్లే బయటకు ఎక్కడైనా వెళ్లిన తాను కంఫర్ట్ గా ఫీల్ అవ్వకపోవడంతోనే ఎక్కడికి వెళ్ళరని సమాచారం. అందుకే సినిమా వేడుకలకు కూడా ఈయన దూరంగా ఉంటారని చెప్పాలి.