Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన వయసు పై పడుతున్న కొద్ది చాలా అందంగా తయారవుతున్నారు. అయితే మహేష్ బాబు ఇలా అందంగా కనిపించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని ఫుడ్ విషయం నుంచి మొదలుకొని ప్రతి ఒక్క విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారని మనకు తెలిసిందే. ఇలా అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండే మహేష్ బాబుకి ఒక చెడ్డ వ్యసనం ఉందని తెలుస్తుంది. మరి మహేష్ బాబుకు ఉన్నటువంటి ఆ చెడు అలవాటు ఏంటి అనే విషయానికి వస్తే…
సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా సెల్ఫోన్ చేతిలో కనపడితే పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోరు అలాంటి చెడ్డ అలవాటు మహేష్ బాబుకు కూడా ఉందని తెలుస్తుంది.ఈయనకు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే గంటల తరబడి ఫోన్ చూస్తూనే కాలక్షేపం చేస్తారట ఇదే విషయాన్ని తాజాగా మహేష్ బాబు మల్టీ స్టోర్స్ కంపెనీ ‘బిగ్ సీ 20వ వార్సికోత్సవ సంబురాల్లో భాగంగా బ్రాండ్అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి మహేష్ పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఈ విషయాన్ని తెలియజేశారు.
Mahesh Babu: లేవగానే ఫోన్ ఉండాల్సిందే…
క్రమంలోనే ఓ రిపోర్టర్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంత సేపు వినియోగిస్తారు అని ప్రశ్నించాడు. అందుకు మహేష్ బదులిస్తూ.. అందరిలాగే తాను కూడా ఫోన్ ను గంటలు తరబడి వాడతానని.. అది తనకు వ్యసనంల మారిపోయిందని ఈ అలవాటు నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలియజేశారు.ఉదయం లేవగానే తనకు మొబైల్ ఫోన్ చూసే అలవాటు ఉంది కొన్నిసార్లు ఇలా ఫోన్లో ఎక్కువసేపు చూడటం వల్ల తలనొప్పి కూడా వస్తుందని ఈ సందర్భంగా మహేష్ బాబు తనకు ఉన్నటువంటి ఈ చెడు అలవాటు గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.