Mahesh Babu:మహేష్ బాబు పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబు తన నటన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక మహేష్ బాబు అంటే తన అందానికి ఎంతోమంది అమ్మాయిలు ఫిదా అవుతూ అభిమానులుగా మారిపోయారు.ఇలా తెరపై ఎంతో అందంగా నవ్వుతూ కనిపించే మహేష్ బాబు తెరవెనక మాత్రం ఒక వింత వ్యాధితో కొన్ని నెలల పాటు బాధపడ్డారని తెలుస్తోంది. ఇలా తాను పడినటువంటి ఇబ్బందులను స్వయంగా మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
మహేష్ బాబు గతంలో ఓసారి తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పి సమస్యతో బాధపడ్డారట ఇలా ఈ తలనొప్పి సమస్యతో ఈయన కొన్ని నెలలపాటు నరకం అనుభవించానని తెలియజేశారు ఎంతోమంది డాక్టర్లను కలిసిన కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదని తెలిపారు.ఎన్నో రకాల పెయిన్ కిల్లర్స్ ఉపయోగించిన ఈ తలనొప్పి మాత్రం తగ్గలేదని ఒక్కో రోజు సుమారు ఆరు నుంచి ఏడు గంటల వరకు ఈ తలనొప్పితో తాను బాధపడిన సందర్భాలు ఉన్నాయని మహేష్ బాబు తెలియజేశారు. ఇలా తాను మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నటువంటి తరుణంలో నమ్రత తన స్నేహితుల సహాయంతో డాక్టర్ సత్య సింధుజాను కలిసి తన సమస్యకు పరిష్కారం తీసుకువచ్చారని తెలిపారు.
Mahesh Babu: ఆరేడు గంటలు బాధ అనుభవించారా…
డాక్టర్ సత్య సింధుజా చేత చక్రసిద్ధ నాడి వైద్యం చేయించిందని ఈ ట్రీట్మెంట్ తర్వాత తనకు ఈ మైగ్రేన్ తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు తాను ఇబ్బంది పడినటువంటి వ్యాధి గురించి తెలియజేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకేకుతున్న గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.