Mahesh Babu: మహేష్ బాబు బాలీవుడ్ ని అవమానించాడా.. ట్విట్టర్ లో వైరల్ ట్రోల్స్!

Akashavani

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీ మహేష్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తన లుక్ తో యువతను సైతం ఆకట్టుకొని మిల్క్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు మహేష్. ఇక మహేష్ బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

మొత్తానికి మహేష్ టాలీవుడ్ అగ్ర స్టార్ హీరోలలో తాను ఒక్కడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక గత రెండు సంవత్సరాలుగా సినిమాల పరంగా ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్న మహేష్.. తాజాగా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా.. పలు సినిమాలకు నిర్మాతగా కూడా బాధ్యత వహిస్తున్నాడు. అడవి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ చిత్రాన్ని మహేష్ బాబు నిర్మించాడు. కాగా ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ సోమవారం నాడు విడుదల చేశాడు. ఈ క్రమంలో మహేష్ కు స్టేజ్ మీద బాలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు అనే ప్రశ్న ఎదురయ్యింది.

దానికి మహేష్.. నాకు ఇప్పటికీ బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను బాలీవుడ్ లో నటించడానికి అంతగా ఇష్టపడను. బాలీవుడ్ లో నటించడం వేస్ట్.. అక్కడి వారు నన్ను భరించలేరు. అంతేకాకుండా నన్ను భరించలేని ఇండస్ట్రీ కి వెళ్లి నేను సినిమా తీయలేను అని మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక నాకంటూ గౌరవం విలువలు ఉన్నాయి అని తెలిపాడు.

Mahesh Babu: మహేష్ నాకంటూ గౌరవం.. విలువలు ఉన్నాయని ఈ విధంగా చెప్పుకొచ్చాడు!

ఇక ఈ విషయం తెలిసిన మహేష్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మహేష్ బాబు బాలీవుడ్ ను అవమానించాడా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక దాదాపు రెండేళ్ల తర్వాత మహేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్లో వస్తున్న సర్కారు వారి పాట ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం మహేష్ బాబు బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు ఒక రేంజ్ లో ట్రోల్ అవుతున్నాయి.

- Advertisement -