Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.ఈయన సినిమా షూటింగ్ సమయంలో కూడా కాస్త విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలకు వెళుతుంటారు. ఈ విధంగా ఏడాదికి రెండు మూడు సార్లు విదేశీ పర్యటన వెళ్తూ ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నారు. ఈ విధంగా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే మహేష్ బాబు ప్రస్తుతం వరుస విదేశీ ప్రయాణాలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మహేష్ బాబు ఈ విధంగా తరచూ విదేశీ పర్యటనలు చేస్తుండడం చూసి ఎంతోమంది నెటిజన్ లు మహేష్ బాబు విదేశాలలో కూడా ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని అందుకే తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు అంటూ కామెంట్లు చేశారు. తాజాగా మహేష్ బాబు విదేశీ పర్యటన గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వినపడుతుంది.మహేష్ బాబు తన కొడుకు కోసమే ఇలా విదేశాలు తిరుగుతున్నాడని తన కొడుకు కోసమే ఈయన తపన పడుతున్నారని తెలుస్తోంది.మహేష్ బాబు కుమారుడు గౌతమ్ గురించి అందరికీ తెలిసిందే ఈయన నెంబర్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో నటించి మెప్పించారు.
Mahesh Babu ఉన్నత చదువుల కోసం కొడుకును విదేశాలలో జాయిన్ చేసిన మహేష్..
ఇకపోతే మహేష్ బాబు కుమారుడు ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించాడని నమ్రత తన కొడుకు పరీక్ష ఫలితాల గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకోచ్చారు. ఇక పదవ తరగతి పూర్తి చేసుకున్న మహేష్ బాబు కుమారుడు ఇంటర్మీడియట్ కూడా హైదరాబాదులోనే జాయిన్ అయ్యారని వార్తలు వచ్చాయి.అయితే మహేష్ బాబు తన కొడుకుని కాలేజీ చదువుల కోసం ఇండియాలో కాకుండా విదేశాలలో జాయిన్ చేశారని అందుకోసమే మహేష్ బాబు తరచూ విదేశాలకు వెళుతూ తన కొడుకుకి మంచి కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈయన ఏ దేశంలో ఏ కోర్సులో తన కొడుకుని చేర్పించారనే విషయం తెలియలేదు. అయితే తన కొడుకు కోసమే మహేష్ బాబు ఇలా సినిమాలను పక్కన పెట్టి మరి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.