Mahesh Babu: రోజు రోజుకు చిన్నపిల్లాడిలా మారిపోతున్న మహేష్ బాబు.. కొడుకు ఏమో ఎద్దులా పెరుగుతున్నాడుగా!

Akashavani

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కృష్ణ నట వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంటూనే తన వ్యక్తిగత జీవితానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

సినిమా షూటింగులు సమయంలో ఏ మాత్రం విరామం దొరికిన మహేష్ బాబు తన భార్యా పిల్లలతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లి ఎంతో ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా తన పిల్లలు సితార, గౌతమ్ తో మహేష్ బాబు ఒక తండ్రిలా కాకుండా ఫ్రెండ్ గా వారిని ట్రీట్ చేస్తూ వారితో సరదాగా గడుపుతూ ఉంటారు.మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కూడా ఇప్పటికే మహేష్ బాబు నటించిన నేనొక్కడినే చిత్రంలో చిన్నప్పటి మహేష్ బాబు పాత్ర ద్వారా నటించి సందడి చేశారు. ప్రస్తుతం గౌతమ్ ఉన్నత చదువులు చదువుతున్న నేపథ్యంలో ఈయన ఇండస్ట్రీ వైపు అడుగులు వేయలేదు చదువులు పూర్తి అయిన అనంతరం గౌతమ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

Mahesh Babu: రోజు రోజుకు చిన్నపిల్లాడిలా మారిపోతున్న మహేష్ బాబు.. కొడుకు ఏమో ఎద్దులా పెరుగుతున్నాడుగా!
Mahesh Babu: రోజు రోజుకు చిన్నపిల్లాడిలా మారిపోతున్న మహేష్ బాబు.. కొడుకు ఏమో ఎద్దులా పెరుగుతున్నాడుగా!

Mahesh Babu: ఎంతో అందంగా మహేష్…

ఇకపోతే మహేష్ బాబు భార్య నమ్రత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లలకు సంబంధించిన విషయాలను వారి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గౌతమ్ సితార ఫోటోలు నెట్టింట్లో బోలెడన్ని చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ ఫోటోలను చూసిన ఎంతో మంది నెటిజన్లు మహేష్ బాబు కన్నా తన కొడుక్కి ఎంతో గొప్పగా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. మహేష్ బాబు వయసు పైబడుతున్న కొద్దీ రోజురోజుకు ఎంతో స్లిమ్ గా చిన్న పిల్లాడిలా మారిపోతూ ఉంటే తన కొడుకు మాత్రం ఎద్దులా పెరిగిపోతున్నాడు అంటూ మరికొందరు గౌతమ్ బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా మహేష్ బాబు అందాన్ని పొగుడుతూనే మరోవైపు తన కొడుకు పట్ల ఈ విధమైనటువంటి కామెంట్ చేయడంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -