Mahesh Babu: సీఎం జగన్ డైలాగ్ వాడినందుకు మహేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి.. వామ్మో భయంకరం!

Akashavani

Mahesh Babu: మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో నటించిన సర్కారీ వారి పాట సినిమా ఈనెల 12వ తేదీ విడుదల అయ్యి మిశ్రమ స్పందన దక్కించుకుంది.అయితే ఈ సినిమా బాగున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే మెగా అభిమానులు డిజాస్టర్ ట్రెండ్ చేస్తున్నారని మహేష్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో మెగా హీరోలు నటించిన సినిమాల విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూ ఇవ్వడం వల్లే ఇలా మెగా అభిమానులు మహేష్ సినిమాపై పగ తీర్చుకుంటున్నారని తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన తరువాత పెద్ద ఎత్తున ట్రైలర్ వైరల్ అయింది.ఈ ట్రైలర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పిన డైలాగ్ ఉపయోగించడం వల్ల ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది నేను విన్నాను.. నేను ఉన్నాను అనే డైలాగ్ పెట్టడం వల్ల ఎంతోమంది మహేష్, జగన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఈ డైలాగ్ ఎందుకు పెట్టారనే విషయం గురించి డైరెక్టర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ డైలాగు గురించి క్లారిటీ ఇచ్చారు.

Mahesh Babu: సీఎం జగన్ డైలాగ్ వాడినందుకు మహేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి.. వామ్మో భయంకరం!
Mahesh Babu: సీఎం జగన్ డైలాగ్ వాడినందుకు మహేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి.. వామ్మో భయంకరం!

Mahesh Babu: ఫోటో మార్ఫింగ్..

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు మహేష్ బాబు మ..మ.. మహేష్ అనే పాటలో ఎరుపు పూలరంగు చొక్కా వేసుకొని మెడలో, పూలు వేసుకుని వాసన చూస్తూ ఉన్నటువంటి లుక్ వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఇదే ఫోటో సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు ఫోటోను భయంకరంగా, వేశ్యగా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది మహేష్ బాబు అభిమానులు ఈ ఫోటో పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అభిమానుల మధ్య వారి సినిమాల విషయంలో సోషల్ వీడియో వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున గొడవ పడుతున్నారు.

- Advertisement -