Mahesh Babu: ఆ సినిమాతో పోకిరి రోజులు గుర్తుకొచ్చాయంటున్న మహేష్ బాబు!

Akashavani

Mahesh Babu: టాలీవుడ్ లో మహేష్ బాబు పేరు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. రాజకుమారుడు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ ఆ పై పలు సినిమాల్లో నటించి నటన లో తండ్రికి తగ్గ కొడుకు గా పేరు తెచ్చుకున్నాడు. ఇక పోకిరి సినిమా తో మహేష్ బాబు రేంజ్ స్టార్ హీరో స్థాయికి ఎదిగింది.

ఇక మహేష్ బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ హీరోలలో తాను ఒక్కడి గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. దాదాపు నాలుగు పదుల వయసు వచ్చినప్పటి.. ఇప్పటి యువ హీరోలు ఫిదా అయ్యేలా తన గ్లామర్ ను ఒక రేంజ్ లో కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక గత రెండేళ్లుగా మహేష్ బాబు సినిమాల పరంగా దూరంగా ఉన్న సంగతి మనకు తెలుసు.

అయినప్పటికీ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటాడు. రెండేళ్ల తర్వాత మహేష్, పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న సర్కారు వారి పాట మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాను ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం కాబట్టి. ప్రేక్షకులు ఈ సినిమా సక్సెస్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇక విడుదల సమయం దగ్గర పడటంతో తాజాగా హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్రారంభించారు.

Mahesh Babu: ఆ సినిమాతో పోకిరి రోజులు గుర్తుకొచ్చాయంటున్న మహేష్ బాబు!
Mahesh Babu: ఆ సినిమాతో పోకిరి రోజులు గుర్తుకొచ్చాయంటున్న మహేష్ బాబు!

Mahesh Babu: పరశురామ్ మహేష్ బాబు క్యారెక్టర్ ను ఈ విధంగా డిజైన్ చేశాడు!

ఈ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదలైనప్పుడు తనుకు పోకిరి సినిమా రోజులు గుర్తుకొచ్చాయని తెలిపాడు. అంతేకాకుండా పరశురామ్ నా క్యారెక్టర్ బాగా డిజైన్ చేశాడని పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

- Advertisement -