Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు మొదట చైల్డ్ ఆర్టిస్టుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో మహేష్ బాబుకి అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మహేష్ బాబు 50 ఏళ్లకు చేరువవుతున్న కూడా ఆయన ఇప్పటికీ కుర్రాడిలా యవ్వనంగా ఉంటున్నాడు. ఇలా ఎంతోమంది అమ్మాయిలు మహేష్ బాబు అందానికి ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు తన భార్య నమ్రత మీద చేయి చేసుకున్నట్లు వినిపిస్తున్న వార్త సంచలనం రేపుతోంది. అయితే మహేష్ బాబు అలా చేయటానికి గల కారణం గురించి తెలిసి అభిమానులు కూడా అయ్యో పాపం అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే గౌతమ్ కి గర్భంతో ఉన్న సమయంలో నమ్రత ఎన్నో ఇబ్బందులు పడిందట. బేబీ కండిషన్ సరిగా లేదని డాక్టర్లు చెప్పటంతో నమ్రత బాగా డిప్రెషన్ కి లో ఉన్నాయి తనలో తానే బాధపడుతూ కృంగిపోయేదట . అయితే మహేష్ బాబు ఎంత చెప్పినా కూడా వినకుండా నిత్యం బాధపడుతూ ఉండేదట.
Mahesh Babu: నమ్రతను లాగి పెట్టి కొట్టిన మహేష్…
దీంతో డాక్టర్ల సలహా మేరకు మహేష్ బాబు ఆమెను చాచి చంపపై కొట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటే.. నమ్రత మాత్రం మహేష్ బాబు వ్యాపారాలతో పాటు ఆయన సినిమాకు సంబంధించిన పనులు, ఇంటి బాధ్యతలు కూడా చక్కగా నిర్వర్తిస్తూ అన్నివేళలా మహేష్ బాబుకు అండగా నిలుస్తోంది.