Namratha: నమ్రత చెప్పే గాసిప్స్ వింటే చెవులు పెలిపోతాయ్.. భార్యపై మహేష్ బాబు కామెంట్స్!

Akashavani

Namratha: టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. రాజకుమారుడు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి టాప్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇక పోకిరి సినిమాతో ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టుకొని ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు.

మొత్తానికి మహేష్ బాబు టాలీవుడ్ లో అగ్ర స్టార్ హీరోలలో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట ఈ సినిమాతో ప్రేక్షకులముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. పరశురామ్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ను పలకరించబోతుంది.

ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇక మహేష్ సరసన కీర్తి సురేష్ నటించడంతో ఆ అంచనాలకు మరింత ఆజ్యం పోసినట్లుగా అయ్యింది. ఇక ప్రస్తుతం మహేష్ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన భార్య నమ్రత గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. నమ్రతతో ఏమైనా గాసిప్స్ డిస్కస్ చేస్తారా? అని సుమ అడిగింది.

దానికి మహేష్ మాట్లాడుతూ.. ఆమె ఫ్రెండ్స్ తో మాట్లాడే గాసిప్స్ కి నేను చెవులు మూసుకుంటాను అని మహేష్ అంటాడు. ఇక మహేష్ తన భార్య గురించి ఫన్నీ సీక్రెట్ బయటపెట్టడంతో తన అభిమానులు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు.

Namratha: మహేష్.. తన భార్య గురించి ఈ సీక్రెట్ బయట పెట్టాడు!

ఇక మహేష్ బాబు రాబోయే సినిమాల విషయానికి వస్తే.. జనగణమన అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సర్కారు వారి పాట సినిమాతో మహేష్ ప్రేక్షకుల ను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.

- Advertisement -