Mahesh Babu: ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశి ఖన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమా త్వరలోనే విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను విడుదల చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించడంతో ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం తక్కువ అయింది. అందుకే సినిమాను థియేటర్లో చూడాలంటే సినిమాని ఓటీటీలో ఆలస్యంగా విడుదల చేయాలి. అలాగే సినిమా టికెట్ల రేట్లు అధికంగా ఉండటం వల్ల ప్రేక్షకులు తిరిగి సినిమాని థియేటర్ లో చూడలేకపోతున్నారు అంటూ అరవింద్ మాట్లాడారు. అదే విధంగా సినిమాను నిర్మాతలు ప్రమోషన్ చేస్తే ఎవరూ థియేటర్లకు రారని హీరో హీరోయిన్లు మాత్రమే సినిమాని ప్రమోట్ చేయాలని ఆయన తెలిపారు.

Mahesh Babu: ఆ బాధ్యత హీరో హీరోయిన్లదే…
ఈ మధ్యకాలంలో ఒక హీరో తన సినిమాను ప్రమోట్ చేయడం కోసం ఏకంగా స్టేజీపై డాన్స్ చేశారు అంటూ ఈయన గుర్తు చేశారు. మహేష్ బాబు పేరు ప్రస్తావన తీసుకు రాకపోయినా మహేష్ బాబుని ఉద్దేశిస్తూ ఆయన స్టేజీపై డాన్స్ చేయడాన్ని ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడారు.ప్రేక్షకులను ఆకట్టుకుని వారిని థియేటర్లకు రప్పించే బాధ్యత హీరోహీరోయిన్లపై ఉంటుందని, అందుకే సినిమా ప్రమోట్ చేసే బాధ్యత హీరోలదేనని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇకపోతే మహేష్ వేదికపై డాన్స్ చేయడాన్ని పలువురు స్టేజ్ డాన్సర్ అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా మహేష్ బాబు ఇలా ప్రేక్షకులను సందడి చేయడం కోసం వేదికపై డాన్స్ చేయడంతో పలువురు ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణమనీ చెప్పాలి.అయితే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పరోక్షంగా మహేష్ బాబు గురించి ప్రస్తావిస్తూ ఈయనల ప్రతి ఒక్కరు వారి సినిమాని ప్రమోట్ చేసుకోవాలని సూచించారు.