Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు ఇలా ఒక వైపు సినిమాలలో స్టార్ హీరోగా కొనసాగుతూ భారీ స్థాయిలో సంపాదిస్తున్నటువంటి మహేష్ బాబు మరోవైపు ఎంబి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా రీల్ జీవితంలోనే కాదు, రియల్ జీవితంలో కూడా ఈయన హీరో అని అనిపించుకున్నారు.
మహేష్ బాబు తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు. అయితే ఈయనకు ఎప్పుడైతే షూటింగ్ సమయంలో విరామం దొరుకుతుందో ఆ క్షణమే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇలా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఫారిన్ వెళ్తూ ఉంటారు. ఇలా మహేష్ బాబు తనకు షూటింగ్ కనుక లేకపోతే మొదటి ప్రాధాన్యత తన కుటుంబానికి ఇస్తారు. ఇక కుటుంబంతో కలిసి ఉన్నప్పటికీ కూడా ఖాళీగా ఉన్న తన చేతిలో ఏదో ఒక పుస్తకం ఉంటుందని ఒక వార్త వైరల్ అవుతుంది.
పుస్తకం చేతిలో ఉండాల్సిందేనా…
మహేష్ బాబు షూటింగ్ లొకేషన్లో కనక కాస్త సమయం దొరికిన చేతిలో ఏదో ఒక పుస్తకం పట్టుకొని చదువుతూ ఉంటారట. అలాగే ఫ్లైట్ జర్నీ కానీ ఇతర జర్నీస్ లో కూడా ఈయన పుస్తకాలను చదువుతూ ఉంటారని ఇలా చదవటం వల్ల తన మనసుకు అలాగే మైండ్ కూడా కాస్త రిలీఫ్ గా ఉంటుందని మహేష్ భావిస్తారట. అందుకే తనకు ఖాళీ సమయం దొరికితే తనకెంతో ఇష్టమైనటువంటి పుస్తకాలను చదువుతూ ఉంటారని తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఏంటి మహేష్ బాబుకు ఇలాంటి అలవాటు కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.