Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు మహేష్ బాబు. ఈయన నమ్రత అనే హీరోయిన్ ని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.నమ్రత సైతం మహేష్ బాబుకి ఇచ్చిన మాట ప్రకారం పెళ్లయిన తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. తనకు ఇప్పుడు కూడా మహేష్ బాబు సినిమాలలో అవకాశం వచ్చినా కూడా నటించనని ఖరాఖండిగా చెప్పేశారు. ఇలా మహేష్ బాబు నమ్రత దంపతులు ఎంతో సంతోషంగా అన్యోన్యంగా ఎందరికో ఆదర్శంగా ఉన్నారని చెప్పాలి.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా ఉన్నటువంటి మహేష్ నమ్రత దంపతులు ఒకానొక సమయంలో ఒక హీరోయిన్ కారణంగా తీవ్రస్థాయిలో గొడవపడ్డారని ఆమె వల్ల వీరిద్దరు విడాకులు కూడా తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇలా మహేష్ బాబు నమ్రత కాపురంలో చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…. ఆ హీరోయిన్ మరెవరో కాదు నటి త్రిష.
Mahesh Babu: హీరోయిన్ త్రిష కారణమా…
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాలలో నటిస్తే వారి మధ్య ఏదో ఉంది అనే వార్తలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే మహేష్ బాబు త్రిష కలిసి అతడు సినిమాలో నటించారు.ఈ సినిమా తర్వాత వెంటనే వీరిద్దరి కాంబినేషన్లో సైనికుడు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా వరుసగా రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి అయితే ఈ వార్తలు నిజమేనని భావించిన నమ్రత మహేష్ తో గొడవపడి విడాకుల వరకు వెళ్లారని అప్పట్లో వైరల్ అయింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి మహేష్ నమ్రత ఎంతో సంతోషంగా ఎందరో స్ఫూర్తిగా ఉన్నారని చెప్పాలి.