Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబుకి విపరీతమైన లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇలా మహేష్ బాబు కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ సి 20వ వార్షికోత్సవ కార్యక్రమాలలో భాగంగా మహేష్ బాబు పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు నలుపు రంగు గల్లా చొక్కా ధరించి చాలా అందంగా కనిపించారు.
ఇక ఈ కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో ఈయన మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు ధరించినటువంటి షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ క్రమంలోనే మహేష్ బాబు వేసుకున్నటువంటి ఈ చొక్కా ధర ఎంత ఉంటుందని ఆరా తీయడం మొదలుపెట్టారు.చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నటువంటి ఈ షర్ట్ ఖరీదు తెలిసి అనంతరం అందరూ ఆశ్చర్యంతో షాక్ అవుతున్నారు. ఇక మహేష్ బాబు వేసుకున్నటువంటి ఈ షర్ట్ ఓ ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించిన షర్ట్ అని తెలుస్తుంది.
Mahesh Babu: వేళలో ఖరీదు చేస్తున్న చొక్కా…
ఈ గళ్ళ చొక్కా ఖరీదు అక్షరాల17,999 రూపాయలు అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే సినిమా సెలబ్రిటీలు ఇలా ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం వారికి వీటి ధర సాధారణం అయినప్పటికీ సాధారణ ప్రజలకు అభిమానులకు మాత్రం వీటి ధర చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.