Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన నాలుగుపదుల వయసులో ఉన్నప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా కనబడుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా మహేష్ బాబుకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలలో మహేష్ బాబు నటిస్తూ బిజీగా ఉన్నారు. గత ఎడాది సర్కారు వారి పాట సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా SSMB 28వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులు జరుపుకుంటుంది.
ఇందులో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే శ్రీ లీలా నటిస్తున్నారు. ఇక సినిమా గత ఏడాది ఫిబ్రవరిలో పూజ కార్యక్రమాలను ప్రారంభించగా అక్టోబర్లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ తరచూ ఈ సినిమాకు బ్రేక్స్ పడుతూ వస్తున్నాయి. ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి కాగానే మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు మరణించడంతో ఈ సినిమా షూటింగ్ కు లాంగ్ బ్రేక్ పడింది. అయితే తిరిగి మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. మరో రెండు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కావడంతో మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఫారెన్ వెకేషన్ వెళ్లారు.
Mahesh Babu: స్కిన్ ఎలర్జీ…
వెకేషన్ పూర్తిచేసుకుని తిరిగి వచ్చిన మహేష్ బాబు ఒక సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది.గత కొద్దిరోజులుగా మహేష్ బాబు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారట అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం సమ్మర్లో బయటకు వెళ్ళగా ఆయన స్కిన్ ఎలర్జీతో మరింత ఇబ్బందిపడతానని ఉద్దేశంతోనే సమ్మర్ మొత్తం సినిమా షూటింగుకు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. ఇలా సమ్మర్ వెకేషన్ కోసం మహేష్ బాబు తిరిగి తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.ఇక మహేష్ బాబు సినిమాకు లాంగ్ బ్రేక్ ఇవ్వడంతో చేసేదేమీ లేక త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకు బ్రేకిచ్చారట అయితే ఈ సినిమా విడుదలకు చాలా సమయం ఉంది కనుక ఈ మూడు నెలలపాటు సినిమాకు బ్రేక్ ఇచ్చిన పెద్ద నష్టమేమీ లేదని మేకర్స్ భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.