Mahesh Fans: మెగా ఫ్యాన్స్ కాదు మెగా మాఫియా అని పెట్టుకోండి.. దారుణంగా తిట్టుకుంటున్న మహేష్, చిరు అభిమానులు!

Akashavani

Mahesh Fans: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోని మరొక స్టార్ హీరో అభిమానులు ట్రోల్ చేయడం సర్వసాధారణం. అయితే ఈ పద్ధతి గతంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ మెగాస్టార్ చిరంజీవి కాలం నుంచి కొనసాగుతోంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున వారి అభిమాన హీరోలపై
ప్రశంసలు కురిపించుకుంటూ ఇతర హీరోల పై విమర్శలు చేసేవారు. అయితే ప్రస్తుతం కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతూ ఉంది.ప్రస్తుతం కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే వెంటనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారి హీరోల గురించి గొప్పగా చెప్పుకోవడం, ఇతర హీరోల గురించి విమర్శలు చేయడం వస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం మెగా హీరోలు నటించిన సినిమాల గురించి పెద్ద ఎత్తున ఇతర హీరో అభిమానులు విమర్శలు చేశారు.అయితే తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల కావడంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా చిరు అభిమానులు, మహేష్ బాబు అభిమానుల మధ్య యుద్ధం జరుగుతోంది.

Mahesh Fans: మెగా ఫ్యాన్స్ కాదు మెగా మాఫియా అని పెట్టుకోండి.. దారుణంగా తిట్టుకుంటున్న మహేష్, చిరు అభిమానులు!
Mahesh Fans: మెగా ఫ్యాన్స్ కాదు మెగా మాఫియా అని పెట్టుకోండి.. దారుణంగా తిట్టుకుంటున్న మహేష్, చిరు అభిమానులు!

Mahesh Fans: అప్పట్లో బాలకృష్ణ సినిమాలు…

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మెగా హీరోల అభిమానులను మాఫియాలతో పోల్చారు. అప్పట్లో ఈ మెగా మాఫియాలు ఎప్పుడు బాలకృష్ణపై పడి ఏడ్చేవాళ్ళు. ప్రస్తుతం ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ వంటి స్టార్ హీరోల మీద పడి ఏడుస్తున్నారు. అందుకే మెగా ఫ్యాన్స్ అని తీసేసి మెగా మాఫియా అని పెట్టుకోండి. మీ మెగా మాఫియాకు మేం బానసల సలాం అని పెట్టుకోండి అంటూ పెద్ద ఎత్తున మెగా అభిమానులకు మహేష్ అభిమానులకు మధ్య వార్ నడుస్తోంది.ఏది ఏమైనా మహేష్ నటించిన సర్కారీ వారి పాట సినిమా అద్భుతంగా ఉన్నప్పటికీ మెగా అభిమానులు ఇంత స్వార్థం కోసం ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేయడం మహేష్ బాబు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

- Advertisement -