Mahesh – Rajamouli: మహేష్ – రాజమౌళి మూవీలో సచిన్ కూతురు..!

G K

Mahesh – Rajamouli: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సర్కారు వారి పాట మే 12న భారీ స్థాయిలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో లిరికల్ సాంగ్స్‌తో పాటుగా హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రముఖ ఎఫ్ ఎం రేడియో స్టేషన్స్‌లో సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఇక థియేట్రికల్ ట్రైలర్‌ను మే 2న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే, సర్కారు వారి పాట సినిమా నుంచి వచ్చిన ప్రతీది అంచనాలు పెంచాయి.

అలాగే, త్వరలో రాబోతున్న థియేట్రికల్ ట్రైలర్ మరో రేంజ్‌లో అంచనాలు పెంచడం ఖాయమని మహేశ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటున్నారు. ఇక మహేశ్ బాబు తన నెక్స్ట్ సినిమాలను కూడా లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను జూన్ నుంచి మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

Mahesh – Rajamouli: అదో పెద్ద సంచనలమే..

ఇక దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. తిరిగొచ్చాక మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌ను మొదలుపెట్టబోతున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఇండియన్ క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కూతురు నటించబోతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు సినీ తారల పిల్లలే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ కూతురు ఎంట్రీ అంటే అదో పెద్ద సంచనలమే అనుకోవాలి. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూద్దాం.

- Advertisement -