Majili Movie: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమా తర్వాత సమంత సౌత్ లో మాత్రమే కాకుండా అటు బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటుంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ సినిమా షూటింగ్ పనులతో బిజీగా మారిపోయింది. అయితే కొంతకాలం అనారోగ్య సమస్యల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ఇటీవల అనారోగ్యం నుండి కోలుకొని మళ్ళీ షూటింగ్ పనులలో బిజీగా ఉంది. సమంత నటించిన శకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్నారు. అయితే నాలుగు సంవత్సరాల క్రితం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన మజిలీ సినిమాలో కూడా సమంత నటించింది. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత జంటగా నటించారు. నేటికి మజిలీ సినిమా విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ క్రమంలో ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.
Majili Movie: లవ్ యు శివ నిర్వాణ…
‘మజిలి’ విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. డైరెక్టర్ శివ నిర్వాణతో కలిసి ‘మజిలి’ సెట్స్ లో సందడి చేసిన ఒక ఫొటోను సోషల్ మీడియా ద్వారా సమంత అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో ‘లవ్ యూ శివ నిర్వాణ. శ్రావణి లాంటి ఒక మంచి పాత్రను అందించినందుకు. ప్రస్తుతం ఖుషిలో ‘ఆరాధ్య’తో అదరగొడుదాం’ అంటూ పోస్ట్ షేర్ చేసింది. అంతే కాకుండా మజిలి సినిమాలోని తన ఎంట్రీ సీన్ ను కూడా ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత అభిమానులు కూడా నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటమే కాకుండా సమంత , నాగచైతన్య కలిసి ఉన్నప్పటి జ్ఞాపకాలను కూడా గర్తు చేసుకుంటున్నారు.