Malaika Arora బాలీవుడ్లో పలు రకాల స్పెషల్ సాంగ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటులలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మలైకా అరోరా ఒకరు. అయితే ఈ అమ్మడు తెలుగులో కూడా ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ చిత్రంలో కూడా కెవ్వు కేక అంటూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించి హీట్ పెంచేసింది. అయితే నటి మలైకా అరోరా కేవలం స్పెషల్ సాంగ్స్ లో మాత్రమే కాకుండా పలు చిత్రాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించి బాగానే సక్సెస్ అయింది. మలైకా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ పెళ్లి చేసుకోకుండా కేవలం సినిమాలపై మాత్రమే దృష్టి సారించింది.
అయితే ఈ మధ్య కాలంలో నటి మలైకా అరోరా ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క పలు రకాల ఫోటోషూట్ కార్యక్రమాలు అలాగే మ్యాగజైన్ షూట్ కార్యక్రమాలు వంటి వాటిలో పాల్గొంటూ ఘాటుగా అందాలు ఆరబోస్తుంది. ఈ క్రమంలో తాజాగా నటి మలైకా అరోరా ఓ ప్రముఖ మ్యాగజైన్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో భాగంగా బికినీ దుస్తులు ధరించి సిగ్గుపడుతూ కొంటె చూపులతో కనిపించింది.
అలాగే తన హాట్ థందర్ థైస్ చూపిస్తూ ఘాటుగా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. ఇంకేముంది ఈ అమ్మడి అందాల ఆరబోత నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు అంతేకాకుండా 40 ఏళ్ల వయసు పైబడిన ఇప్పటికీ ఇంకా యంగ్ గా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ మతి పోగొడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి మలైకా అరోరా తన భర్తతో విడిపోవడానికి ఓ బాలీవుడ్ యంగ్ హీరో తో ఉన్నటువంటి లవ్ అఫైర్ కారణమని బాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి కూడా అ చేసుకోబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది కానీ నటి మలైకా అరోరా మరియు ఆమె ప్రియుడు మాత్రం ఆమె పెళ్లిపై వినిపిస్తున్న ఈ వార్తలపై స్పందించడం లేదు సరికదా కనీసం పట్టించుకోవడం లేదు. మరి వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.