Malayalam Heroine: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్నాక సినీ తారల కు ఎదో ఒక విధంగా వేధింపుల సెగ తగులు తూనే ఉంటుంది. ఆ మధ్య ఒక వ్యక్తి ఓ హీరోయిన్ పర్సనల్ కాంటాక్ట్ తీసుకొని తనతో అసభ్యకరంగా వాట్సాప్ లో ఫోటోలు పెట్టి వేధించి బాధించిన విషయం వెలుగులోకి వచ్చింది. మొన్నటి వరకు ఈ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ జనరేషన్లో ఇవి మరింత పెరిగాయి.
ఇదిలా ఉంటే తాజాగా దీనికి సంబంధించిన ఒక మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మలయాళ నటి అర్చనా కవి తన ఫ్యామిలీ ఫ్రెండ్ తో కలిసి బయటికి వెళ్లి వస్తుండగా ఒక కానిస్టేబుల్ తన పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించాడు అంటూ సోషల్ మీడియాలో వెల్లడించింది. అంతేకాకుండా ఈ సంఘటన తనను ఎంతో బాధించిందని ఆమె వెల్లడించింది.
రాత్రి పదకొండు గంటలకు మేము తిరిగి ఇంటికి వెళుతున్నాము, పెట్రోలింగ్ లో భాగంగా పోలీసులు మా దగ్గరకు వచ్చి మేం ప్రయాణిస్తున్న ఆటోని ఆపారు. ఆ క్రమంలో ఒక కానిస్టేబుల్ మమ్మల్ని కొన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో వేధించాడు. మేము ఇంటికి వెళ్తున్నాము అని చెప్పిన కానీ వినిపించుకోలేదు. కాగా దీని పై ఆ రోజు మా పై కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు నచ్చలేదని అర్చనా కవి వెల్లడించింది.

Malayalam Heroine: ఆ నటిని వేధించిన కానిస్టేబుల్ కు డీసిపి ఈ విధంగా బుద్ధి చెప్పినట్లు తెలిసింది!
అనంతరం ఆ కానిస్టేబుల్ అలా నేను కావాలని చేయలేదు అని పెట్రోలింగ్ లోని భాగం గా ఇదంతా చేశాను అని అన్నాడట. ఇక సెక్యూరిటీ ఇవ్వాల్సిన అధికారులే ఆడ వాళ్ళను ఇలా ఇబ్బంది పెట్టడంతో.. సదరు కానిస్టేబుల్ తో ఆనటికి క్షమాపణలు చెప్పించాలి అనుకున్నట్లు తెలుస్తుంది. ఇక చట్టబద్దమైన చర్యలు కూడా తీసుకుంటామని సదరు కానిస్టేబుల్ పనిచేసే స్టేషన్ డీసిపి వెల్లడించిన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన అక్కడ స్థానికంగా పోలీసులకు అవమానకరంగా మారినట్లు తెలుస్తుంది.