Malli pelli: నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా మే 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆతృతంగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని చెప్పాలి.ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం గురించి తెలిసినవారు సినిమాని చూడటానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. సినిమా చాలా బోర్ కొడుతుందన్న భావనలో ప్రేక్షకులు ఉన్నారు.
నరేష్ పవిత్ర వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా వస్తుందని మొదటి నుంచి భావిస్తున్న నరేష్ మాత్రం లేదని చెబుతున్నారు కానీ సినిమాని చూస్తే ఇది నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా చేసిన సినిమా అని స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నటువంటి వీరిద్దరూ ఈ సినిమా చేయడానికి గల కారణం, ఈ సినిమా సారాంశం ఏంటి అనే విషయానికి వస్తే మేమిద్దరం ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న తమ తప్పు ఏమాత్రం లేదని తమని పెళ్లి చేసుకున్న వారు పెట్టి టార్చర్ కారణంగానే ఇద్దరం ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని నిరూపించడం కోసమే 15 కోట్లు ఖర్చు చేసి ఈ సినిమా చేశారని తెలుస్తుంది.
Malli pelli: రిలేషన్ లో ఉండడం తప్పు కాదు..
ఈ సినిమా ద్వారా నరేష్ పవిత్ర ఇద్దరు మేము రిలేషన్ లో ఉండడం తప్పు కాదని నిరూపించుకున్నారు. అంతేకాకుండా నరేష్ తన భార్య రమ్య రఘుపతిని, పవిత్ర లోకేష్ తన భర్తను ఈ సినిమాలో విలన్లుగా చూపించడం గమనార్హం. ఈ సినిమాపై నమ్మకంతో నరేష్ స్వయంగా ఈ సినిమాని 15 కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. అయితే ఈ సినిమా మాత్రం పెద్దగా కలెక్షన్లను రాబట్టకపోవడంతో నరేష్ కు నష్టాలు తప్పవని పలువురు భావిస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.