Mamatha Mohandas: మమతా మోహన్ దాస్ అనే ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి. తన నటనతో, అందంతో ఎంతోమంది కుర్రాళ్ళ మనసులు దోచుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత కృష్ణార్జున, హోమం, చింతకాయల రవి, కేడి పలు సినిమాలలో కూడా నటించింది.
కేవలం నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్ లను వినిపించి మంచి విజయాన్ని అందుకుంది. తెలుగుతో పాటు మలయాళం సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. అయితే గతంలో ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ వ్యాధి సోకటంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
ఆ తర్వాత వ్యాధి నుండి కోలుకున్నాక మళ్లీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి సెకండ్ హీరోయిన్గా చేసింది. అయితే ఆ సమయంలో లింఫోమా అనే వ్యాధి సోకటంతో మళ్లీ సినిమాలకు దూరమైంది. ఆ సమయంలో చికిత్స తీసుకొని ఆ వ్యాధి నుండి బయటపడి మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే మళ్లీ ఇటీవల మరో వ్యాధికి గురైంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాకుండా తన ఫోటోలు రెండు పంచుకుంది.
Mamatha Mohandas
ఇక ఆ ఫోటోలను పంచుకుంటూ తను ఆటో ఇమ్యూన్ డిసీజ్ తో బాధపడుతున్న విషయాన్ని తెలిపింది. ఈ వ్యాధి వల్ల తన చర్మం రంగు కోల్పోయిందని తెలిపింది. ఇక ఈ వ్యాధి నుండి బయటపడటానికి డి విటమిన్ అవసరము అని అందుకు ప్రతిరోజు ఉదయం సూర్యుడు ముందు కూర్చుంటాను అని.. సూర్యకిరణాలు శరీరానికి తాకినప్పుడు డి విటమిన్ గ్రహించడం వల్ల ఆ వ్యాధి నుండి బయటపడే అవకాశం ఉంటుంది అని తెలిపింది మమత. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.