Manchu Lakshmi: సాధారణంగా కొన్నిచోట్ల సినిమా సెలబ్రిటీలకు కూడా ఇతర అధికారుల నుంచి చేదు సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే సదరు సెలబ్రిటీలు వారిపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా మంచు లక్ష్మి కి కూడా ఇండిగో విమానయాన సంస్థ నుంచి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది.ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా తనకు జరిగినటువంటి చేదు సంఘటన గురించి తెలియజేయడమే కాకుండా ఇండిగో విమానయాన సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సోమవారం తిరుపతిలో సందడి చేసిన మంచు లక్ష్మి తిరుపతి నుంచి ఇండిగో విమానంలో తిరుపతి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలోని విమానంలో తన పర్స్ మరిచిపోయిన మంచు లక్ష్మి తన పర్స్ కోసం అక్కడ సిబ్బందిని సంప్రదించగా వారు ఏ మాత్రం స్పందించలేదని ఈమె మండిపడ్డారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఇండిగో విమానయాన సంస్థను ట్యాగ్ చేస్తూ మండిపడ్డారు.ఈ క్రమంలోని విమానంలో తన పర్స్ మర్చిపోయాను కానీ సిబ్బంది ఎవరు తనకు సహాయం చేయలేదు దాదాపు 40 నిమిషాల పాటు గేటు దగ్గర వెయిట్ చేశానని తెలిపారు.
Manchu Lakshmi: 103 డిగ్రీల జ్వరంలోనూ బయట కూర్చోబెట్టారు…
ఇలా నేను వెయిట్ చేసిన దానికన్నా తిరుపతి నుంచి హైదరాబాద్ చాలా త్వరగా వచ్చేసానని ఈమె తెలిపారు.ఇలా తనకు సాయం చేయడానికి ఒకరు కూడా రాలేదు సరి కదా 103 డిగ్రీల జ్వరంతో ఉన్న నన్ను దాదాపు 40 నిమిషాల పాటు గేటు దగ్గరే కూర్చోబెట్టారని
సాయం చేసేందుకు ఒక్కరూ కూడా లేరు. గ్రౌండ్ స్టాఫ్ కూడా లేరు. మీరు జీరో సేవలందిస్తూ, ఎలా పనిచేస్తున్నారు’ అని ట్వీట్‌లో మంచు లక్ష్మి మండిపడ్డారు. అయితే ఈమె చేసినటువంటి ఈ ట్వీట్ పై ఇండిగో విమానయాన సమస్త స్పందించారు. మేడమ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మా మేనేజర్‌తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. విమానంలో మీరు మరిచిపోయిన మీ బ్యాగ్ తిరిగి పొందడంలో మా సిబ్బంది సహాయం చేశారని కోరుకుంటున్నాము మీరు త్వరగా కోలుకోవాలని అలాగే తిరిగి మా విమానంలో ప్రయాణిస్తారని ఆకాంక్షిస్తున్నాము మీకు ఎలాంటి సేవలు కావాలని డైరెక్ట్ గా మాకు మెసేజ్ చేయొచ్చు అంటూ ఈమె ట్వీట్లకు ఇండిగో స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి.