Manchu Lakshmi: కూతురితో చిందులేసిన మంచు లక్ష్మి.. ఆచార్య సినిమా పోయినందుకేనా!

Akashavani

Manchu Lakshmi: టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్టర్ మంచు లక్ష్మి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన లక్ష్మీ మంచు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది. ఇక దొంగల ముఠా సినిమాలలో తన అద్భుతమైన నటన కనబరిచింది.

కానీ లక్ష్మీ టాలీవుడ్లో మళ్లీ అవకాశాలు అందుకోలేకపోయింది. అయినా కూడా సోషల్ మీడియా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్లకు పంచుకుంటుంది.

అంతే కాకుండా తన ఆరేళ్ల పాప అయినటువంటి విద్యా నిర్వానకు సంబంధించిన వీడియోలు, తన అప్ డేట్స్ కూడా షేర్ చేస్తుంది. ఇక తాజాగా మంచు లక్ష్మి తన కూతురితో చేసిన డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వీడియోలో మంచు లక్ష్మి బుల్లెట్ బండి పాటకు తన కూతురితో కలిసి వేసిన స్టెప్పులు సోషల్ మీడియా ప్రియులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

ఇక ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా మేం కొంచెం ఫన్ చేశామంటూ.. మంచు లక్ష్మి క్యాప్షన్ ద్వారా తెలిపింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్ లు విసురుతున్నారు. అందులో ఒక నెటిజన్ సూపర్ అని కామెంట్ చేయగా.. మరికొందరు లక్ష్మి కి ఇంత డాన్స్ వస్తుందని అనుకోలేదని కామెంట్ చేస్తున్నారు.

Manchu Lakshmi: కూతురితో చిందులేసిన మంచు లక్ష్మి.. ఆచార్య సినిమా పోయినందుకేనా!
Manchu Lakshmi: కూతురితో చిందులేసిన మంచు లక్ష్మి.. ఆచార్య సినిమా పోయినందుకేనా!

Manchu Lakshmi: లక్ష్మీ మంచు కి ఎదురైన నెగిటివ్ కామెంట్లు ఇవే!

ఇక ఇదే క్రమంలో లక్ష్మి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంది. నువ్వు ఎంత ఊపినా సినిమా అవకాశాలు రావు అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. అంతేకాకుండా నిజం చెప్పు.. ఆచార్య సినిమా పోయిందనే కదా ఫ్యామిలీ మొత్తం డాన్స్ చేస్తున్నారు అని ఒక నెటిజన్ కామెంట్ చేసాడు. ప్రస్తుతం ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -