Manchu Lakshmi: వాళ్ల బతుకులే నయమంటూ వారిని ఉద్దేశించిన మంచు లక్ష్మి!

Akashavani

Manchu Lakshmi:  తెలుగు ప్రేక్షకులకు యాక్టర్ మంచు లక్ష్మి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో పలు సినిమాల్లో మెయిన్ రోల్స్ చేసి తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది. ఇక పలు సినిమాలకు నిర్మాతగా వహిస్తూ అడపాదడపా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది.

ఇక మంచు లక్ష్మి కొంత కాలంగా సోషల్ మీడియాలో ఫుల్ హడావిడి చేస్తుంది. ఇటీవల ఆచార్య సినిమా విడుదల రోజు మంచు లక్ష్మి తన కూతురితో కలిసి వేసిన డాన్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. దాంతో ఆచార్య సినిమా నెగిటివ్ టాక్ వచ్చిందని నువ్వు ఈ విధంగా చిల్ అవుతున్నావా? అని మెగా ఫాన్స్ లక్ష్మీ మంచి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే మంచు లక్ష్మి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేసింది. ఈ జనరేషన్లో నిర్మాతగా వ్యవహరించడం ఎంత కష్టమో చెప్పుకొచ్చింది. ఇప్పటి నిర్మాతలను ఫైనాన్షియర్లు గానే ట్రీట్ చేస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించింది. సినిమా నిర్మాణంలో వారి పాత్రకు అంత ప్రాముఖ్యత ఉందని తెలిపింది.

ఇక చాలా చిరాకుగా ఉంది.. నిర్మాతల కష్టాలు.. యాక్టర్స్ లైఫ్ చాలా బెటర్ అంటూ ఒక హష్ టాగ్ ద్వారా ట్వీట్ చేసింది. ఇక ఒక సినిమా చేయాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. అందర్నీ మేనేజ్ చేయాలని నిర్లక్ష్యం, ఈగోలు, యాటిట్యూడ్ లాంటివి ఎక్కువగా ఉంటాయని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం లక్ష్మీ మంచు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Manchu Lakshmi: వాళ్ల బతుకులే నయమంటూ వారిని ఉద్దేశించిన మంచు లక్ష్మి!
Manchu Lakshmi: వాళ్ల బతుకులే నయమంటూ వారిని ఉద్దేశించిన మంచు లక్ష్మి!

Manchu Lakshmi: మంచు లక్ష్మి నెటిజన్ల నోట్లో ఈ విధంగా నానుతుంది!

ఇక ఈ ట్వీట్ చూసిన కొందరు మంచు లక్ష్మి ఇలా ఎందుకు డిలీట్ చేసింది అని ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఎందుకు ట్వీట్ చేసావ్? అని కామెంట్ల రూపంలో అడుగుతున్నారు. ఈ ట్వీట్ ద్వారా మంచు లక్ష్మి నెటిజన్ల నోట్లో నానారకాలుగా నానుతుంది.

- Advertisement -