Manchu Lakshmi- Manoj: గత కొంతకాలంగా మంచు వారసుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంచు మనోజ్ మనుషుల మీద విష్ణు దాడి చేసినట్లు ఒక వీడియో కూడా వైరల్ అయింది. స్వయంగా మనోజ్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయటంతో నిజంగానే విష్ణు మనోజ్ మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వినిపించాయి. అయితే మోహన్ బాబు కల్పించుకుని మనోజ్ కి సర్ది చెప్పి వెంటనే ఆ వీడియో డిలీట్ చేసినప్పటికీ వారిద్దరి మధ్య ఉన్న గొడవల గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఇటీవల మంచు విష్ణు ఈ గొడవలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవంతా నిజం కాదని చెప్తూ మార్చి 30న విష్ణు ఓ వీడియో షేర్ చేశాడు. హౌస్ ఆఫ్ మంచూస్ పేరిట తమ సొంత బ్యానర్‌లో ఓ రియాలిటీ షో రాబోతుందని ప్రకటించాడు. ఈ వీడియోలో మంచు మనోజ్ విష్ణు మధ్య జరిగిన గొడవకు సంబంధించిన క్లిప్స్ తో పాటు ఈ గొడవపై ప్రసారమైన వార్తలు గురించి కూడా ఉంది. విష్ణు ఈ వీడియో షేర్ చేయగానే నిజంగా వీరిద్దరూ గొడవ పడలేదని రియాలిటీ షో కోసం మాత్రమే అలా చేశారని భావించారు.
Manchu Lakshmi- Manoj: గొడవ కవర్ చేయడానికి విష్ణు ప్రయత్నాలు..
అయితే తాజాగా అన్నదమ్ముల మధ్య గొడవలో మరొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తాజాగా రియాలిటీ షో గురించి మంచు మనోజ్, లక్ష్మి ప్రసన్న స్పందించినట్లు తెలుస్తోంది. హౌస్ ఆఫ్ మంచూస్ గురించి మంచు లక్ష్మి దగ్గర ప్రస్తావించగా.. తను ఎటువంటి రియాలిటీ షో చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక మనోజ్ కి కూడా ఈ రియాలిటీ షో తో ఏ మాత్రం సంబంధం లేదని, ప్రస్తుతం అతను పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉన్నాడని మనోజ్ టీం ఈ వార్తలను తోసి పుచ్చినట్టు తెలుస్తోంది . దీంతో ఇదేం ట్విస్ట్ రా బాబోయ్ అంటూ అభిమానులు అయోమయంలో పడ్డారు. గొడవ కవర్ చేసుకోవడానికే విష్ణు తంటాలు పడుతున్నాడా? అని కామెంట్లు చేస్తున్నారు.