Manchu Manoj: మంచు మనోజ్ భూమ మౌనికను రెండో వివాహం చేసుకున్న తర్వాత వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. మంచు మనోజ్ ఇదివరకే ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయారు ఇలా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయే సమయానికి ఈ దంపతులకు పిల్లలు మాత్రం కలగలేదు. ఇలా విడాకులు తర్వాత ఎవరి జీవితాలలో వారు బిజీ అయ్యారు. ఇకపోతే మంచో మనోజ్ కొంతకాలం పాటు ఒంటరిగా ఉన్నప్పటికీ అనంతరం భూమా మౌనిక రెడ్డి ప్రేమలో పడ్డారు.
ఇలా భూమా మౌనికను ప్రేమిస్తూ పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని భావించిన మనోజ్ పెద్దల అంగీకారం కోసం కొన్ని సంవత్సరాల పాటు ఎదురుచూశారు. చివరికి వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి వివాహం ఈ ఏడాది ఎంతో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగింది.ఈ విధంగా భూమా మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత మంచు మనోజ్ తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఇదివరకే భూమా మౌనికకు పెళ్లి జరగడం ఒక బాబు ఉండడం ఆమె కూడా విడాకులు తీసుకోవడం జరిగింది.
Manchu Manoj: మౌనిక రెడ్డి తల్లి కాబోతున్నారా…
ఇలా బాబు ఉన్నప్పటికీ మౌనిక బాధ్యత బాబు బాధ్యత కూడా తనదే అంటూ మనోజ్ మౌనికను వివాహం చేసుకున్నారు. ఇక మౌనిక కుమారుడు ధైరవ్ నాగిరెడ్డి కూడా మంచు మనోజ్ తో చాలా సన్నిహితంగా ఉండటమే కాకుండా తనని డాడీ అంటూ పిలుస్తూ ఉంటారు. ఇలా మౌనిక కొడుకుకు తండ్రి అయినటువంటి మంచు మనోజ్ త్వరలోనే తండ్రి కాబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం భూమా మౌనిక ప్రెగ్నెంట్ అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ విధంగా ఈమె ప్రెగ్నెంట్ అనే వార్తలు వైరల్ కావడంతో త్వరలోనే మంచు మనోజ్ కూడా తండ్రి కాబోతున్నారంటూ వార్త వైరల్ అవుతుంది మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.