Manchu Manoj: మంచు మనోజ్ మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే ఈయన తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈయన పెళ్లి చేసుకుని తన మొదటి భార్యతో విభేదాల కారణంగా తనకు విడాకులు ఇవ్వడంతో ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.అయితే మనోజ్ త్వరలోనే భూమా మౌనికతో కలిసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ గత కొద్దిరోజులకు వార్తలు వచ్చాయి. అయితే ఇదే విషయాన్ని మనోజ్ కూడా ప్రస్తావిస్తూ మంచి సమయం చూసి ఈ విషయాన్ని తెలియచేస్తానని తెలిపారు.
ఇక ఈయన తాజాగా ట్విట్టర్ వేదికగా తన జీవితానికి ఎంతో ముఖ్యమైనది ఇన్ని రోజులు తన గుండెల్లో దాచుకున్న విషయాన్ని అందరితో పంచుకోబోతున్నాను అంటూ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తాను జనవరి 20వ తేదీ అభిమానులతో పంచుకోనున్నానని చెప్పడంతో తప్పనిసరిగా ఈయన తన రెండవ పెళ్లి గురించి ప్రకటిస్తారని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.ఈరోజు ఉదయం 9:45 నిమిషాలకు ఈయన సోషల్ మీడియా వేదికగా తన కొత్త సినిమా గురించి అనౌన్స్ చేశారు.
Manchu Manoj: కొత్త సినిమా ప్రకటిస్తూ అందరికీ షాక్ ఇచ్చిన మనోజ్..
చాలామంది అభిమానులు మనోజ్ తన రెండో పెళ్లి గురించి చెబుతారు అనుకుంటే ఈయన మాత్రం తన సినిమా గురించి చెబుతూ కొంత పాటు షాక్ ఇచ్చినప్పటికీ అభిమానులు మాత్రం చాలా రోజుల తర్వాత మనోజ్ సరికొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలియడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మనోజ్ వాట్ ద ఫిష్ అనే సినిమాలో నటించబోతున్నారని ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను షేర్ చేస్తూ అసలు విషయం చెప్పడంతో అందరూ సంతోషపడ్డారు. ఇక ఈ సినిమా గురించి మనోజ్ అధికారికంగా ప్రకటించడంతో ఈ సినిమాపై భూమా మౌనిక స్పందిస్తూ..తను తిరిగి తన ఇన్నింగ్స్ ప్రారంభించినందుకు ఆమె శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వాట్ ద ఫిష్ అనే సినిమాతో అందరిని ఆకట్టుకోవాలని కోరుకుంటూ మౌనిక పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.