Manchu Manoj: గత కొంతకాలంగా మంచు మనోజ్ భూమా మౌనికతో రిలేషన్ లో ఉంటూ తమ ప్రేమను బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. అయితే వీరి ప్రేమ విషయం బయటకు తెలియడంతో వీరి పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. ఈ విధంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తల గురించి అధికారికంగా ప్రకటించకపోవడంతో అభిమానులలో కాస్త ఆందోళన ఏర్పడింది.అయితే మార్చి మూడవ తేదీ ఈ అనుమానాలన్నింటికీ మంచు ఫ్యామిలీ చెక్ పెట్టేసింది.
ఇదివరకే మౌనిక మనోజ్ ఇతర వ్యక్తులతో తమ జీవితాన్ని పంచుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయి ఒంటరిగా ఉన్నారు. అయితే ఒంటరిగా ఉన్నటువంటి మనోజ్ మౌనికలు ఇద్దరూ ప్రేమలో పడటం ఆ ప్రేమ పెళ్లిగా మారడంతో ఈ ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే మరికొన్ని ఫోటోలను మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి ఫోటోలను షేర్ చేసిన ఈమె రెండు హృదయాలు మనసు ఒకటే అంటూ మనోజ్ మౌనికల పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.
Manchu Manoj కన్నీళ్లు పెట్టుకున్న నూతన దంపతులు…
ఇకపోతే ఈ పెళ్లిలో మనోజ్ ఒక్క క్షణం పాటు ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారని అర్థం అవుతుంది. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యి చివరికి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో ఈయన మౌనిక తలపై జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతోకాలంగా ఎదురుచూసినటువంటి ఆ ఆనంద క్షణాలు రావడంతో మనోజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో మౌనిక సైతం మోహన్ బాబు మండపంలోకి రాగానే ఒక్కసారిగా ఆయనని పట్టుకొని బోరున ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.