Manchu Manoj: మంచు మనోజ్ గత నెలలో తాను ప్రేమించిన అమ్మాయి భూమా మౌనికన వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వివాహం తర్వాత ఈయన తన భార్యతో కలిసి పలు పార్టీలకు వెళుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అలాగే వెన్నెల కిషోర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అలా మొదలైంది కార్యక్రమానికి కూడా మనోజ్ దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మౌనిక తో తన బంధం గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ నేను నా జీవితంలోఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అయితే మౌనిక కష్టాలు చూసిన తర్వాత నా అవి చాలా చిన్నవి అనిపించాయి.అయితే తనని నా జీవితంలోకి ఆహ్వానించాలని ఉద్దేశంతో తన అభిప్రాయాన్ని మౌనికకు చెప్పగా తాను మీ కుటుంబం ఒప్పుకుంటుందా? సమాజం ఏమనుకుంటుంది? అంటూ ఎన్నో ప్రశ్నలు వేశారు. సమాజం గురించి అనవసరం ఇంట్లో వారి గురించి నేను మాట్లాడతాను అంటూ తాను మౌనికతో పాటు తన బిడ్డను కూడా నా జీవితంలోకి ఆహ్వానించానని తెలియజేశారు.
Manchu Manoj: మౌనికకు ప్రపోజ్ చేసిన మనోజ్…
ఇలా మౌనికను తన జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత హైదరాబాద్లో ఉంటే సరిపోదని భావించి తనతో కలిసి చెన్నై వెళ్ళిపోయానని తెలిపారు.అలా చెన్నైలో ఏడాదిన్నర పాటు తనతో కలిసి ఉన్నానని అయితే ఈ విషయం ఎవరికీ తెలియదంటూ ఈ సందర్భంగా మనోజ్ తెలిపారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా మనోజ్ ఈ విషయాలను తెలియచేయడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.దాదాపు 15 సంవత్సరాల పరిచయంలో నాలుగు సంవత్సరాల ప్రేమలో ఉంటూ చివరికి మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం జరిగింది.