Manchu Manoj: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు పొందిన మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మనోజ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అయితే మనోజ్ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే గత కొంతకాలంగా మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇటీవల మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత వారికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా విష్ణుతో జరిగిన గొడవకు సంబంధించిన వీడియో కూడా షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఏం షేర్ చేసినా కూడా క్షణాలలో వైరల్ గా మారుతుంది.
ఇటీవల విష్ణు మనోజ్ అనుచరుల మీద దాడి చేయడంతో ఆ సంఘటనను మనోజ్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంతకాలం గుట్టుగా ఉన్న అన్నదమ్ముల మధ్య విభేదాలు ఈ వీడియో షేర్ చేయటంతో బట్టబయలు అయ్యాయి. అయితే విష్ణు మాత్రం ఇదంతా కేవలం రియాలిటీ షో కోసం మాత్రమే చేసింది అంటూ ఆ గొడవని కవర్ చేయటానికి ట్రై చేశాడు. కానీ మనోజ్ రియాలిటీ షో చేయటం లేదని మనోజ్ అనుచరులు కుండబద్దలు కొట్టారు. ఇక తాజాగా మనోజ్ మరొక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Manchu Manoj: ప్రేమను పంచు… ప్రేమగా జీవించు
అయితే ఈ వీడియో తనకు తన భార్య మౌనికకు సంబంధించినది. భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకొని నేటికీ నెల రోజులు పూర్తి అయ్యింది. స్నేహితులైన వీరిద్దరికి మొదటి వివాహం అచ్చి రాకపోవటంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ భార్యాభర్తలుగా జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులను ఒప్పించి ఇటీవల వివాహం చేసుకున్నారు. మౌనికను మనోజ్ వివాహం చేసుకుని నేటికి సరిగ్గా నెల రోజులు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ భార్య మౌనికతో ఉన్న వీడియో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేస్తూ ‘ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.