Manchu Manoj: తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. మోహన్ బాబు వారసుడుగా సినీ రంగంలో ప్రవేశం చేసిన మనోజ్ ఎందుకో సక్సెస్ ని సాధించలేకపోయాడు. అతను సినిమాల కంటే.. పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా ట్రెండింగ్ అవుతూ ఉంటాడు.
అయితే గతంలో భూమా మౌనికతో కలిసి పూజలు చేయించినప్పుడే అందరూ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని అనుమానించారు. కానీ ఆ వార్తలకి స్పందించలేదు మనోజ్, భూమిక. కానీ ఆ వార్తలనే నిజం చేస్తూ చాలా రోజులు ప్రేమ ప్రయాణం సాగించిన మౌనిక రెడ్డి, మంచు మనోజ్ ఇద్దరూ మార్చి 3 న ఘనంగా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
ఇద్దరికీ ఇది ద్వితీయ వివాహం కావడం గమనార్హం. ఈ పెళ్లి మంచు లక్ష్మి ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పెళ్లి పనులన్నీ మోహన్ బాబు ఆధ్వర్యంలో జరిగాయి. దగ్గరుండి మరి మనోజ్ పెళ్లి వైభవంగా జరిపించారు మోహన్ బాబు. అయితే రీసెంట్ గా వచ్చిన వార్తలను చూస్తే.. మంచు మనోజ్ పెళ్లి మోహన్ బాబు కి ఇష్టం లేదని.. అందుకు కారణం అలేఖ్య రెడ్డి వేరే రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కావటం అని అపోహలు వెలువడ్డాయి.
Manchu Manoj:
దీంతో అన్ని మంచు లక్ష్మి పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుందని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని నిరూపించారు మోహన్ బాబు. కొడుకు పెళ్లి ని దగ్గరుండి అంగరంగ వైభవంగా జరిపించారు. ఇక ఈ పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన జంటని ఆశీర్వదించారు. ఈ పెళ్లిలో ప్రధాన పాత్ర నిజంగానే మంచు లక్ష్మి తీసుకుందని, పెళ్లి పెద్ద తానే అయి అన్ని బాధ్యతలు తీసుకొని తమ్ముడిని ఓ ఇంటివాడిని చేసింది. మొత్తానికి వచ్చిన పుకార్లకు మోహన్ బాబు ఫుల్ స్టాప్ పెట్టేసాడు.