Manchu Manoj: మంచి మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఇటీవల భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలాకాలంగా వీరి పెళ్లి గురించి అనేక వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇటీవల ఒక శుభముహూర్తాన కుటుంబ సభ్యులు బంధు మిత్రులందరికీ అడుగుపెట్టారు. లక్ష్మీ ప్రసన్న దగ్గరుండి తమ్ముడు వివాహాన్ని తన నివాసంలో ఎంతో ఘనంగా జరిపించింది. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
వివాహం తర్వాత తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మనోజ్ మౌనిక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పటికే వీరి పెళ్ళి జరిగి నెల రోజుకు గడచిపోయింది. అయితే మనోజ్ పెళ్లిలో వచ్చిన బహుమతులను ఇప్పుడు చూపిస్తున్నాడు. పెళ్లికి బంధుమిత్రులు ఇచ్చిన అపురూపమైన కానుకల గురించి సోషల్ మీడియా వేదికగా మనోజ్,మౌనిక అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతున్నారు. తాజాగా రామ్ చరణ్,ఉపాసన ఇచ్చిన కానుక గురించి మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చరణ్ ఉపాసన మనోజ్ పెళ్లికి హాజరు కాలేకపోయినప్పటికీ వారి తరఫున ఒక అద్భుతమైన కానుకను పంపించారు.
Manchu Manoj: సర్ప్రైజ్ గిఫ్ట్స్ అద్భుతంగా ఉంటాయి…
ప్రస్తుతం మనోజ్ – మౌనికకు, చరణ్ – ఉపాసన పంపించిన కానుకకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను మనోజ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ…‘సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇలా అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్యూ స్వీట్ కపుల్ చరణ్, ఉపాసన . మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఉంది. మాల్దీవ్స్ ట్రిప్ నుంచి రాగానే కలుద్దాం. లవ్ యూ మిత్రమా…ప్రేమతో ఎమ్ అండ్ ఎమ్’ అంటూ పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం చరణ్ పంపిన గిఫ్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.