Manchu Manoj: గత కొంతకాలం నుంచి మంచి కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయి అన్న విషయం తెలిసిందే. దీనికి కారణం మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని ప్రేమించడం. భార్యతో విడాకుల తర్వాత మనోజ్ మౌనిక ను ప్రేమిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు భూమా మౌనిక అలాగే మంచు మనోజ్ కలిసి ఉండగా మీడియా కంటపడ్డారు.
దీంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అన్న వార్త చాలా గట్టిగానే వినిపిస్తుంది. అయితే దీని కారణంగానే మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మనోజ్ కు ఆమెతో పెళ్లి గురించి మంచు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అందుకే మంచు మనోజ్ మంచు కుటుంబానికి దూరమయ్యాడు అన్న వార్తలు కూడా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఎందుకంటే తండ్రి మాట కాదన్నాడని విష్ణు సైతం తమ్ముడు మనోజ్ తో మాట్లాడడం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే ఇదంతా జరిగి దాదాపు రెండు నెలలు అవుతుంది. ప్రస్తుతం మంచు మనోజ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉండడం లేదు. కానీ తాజాగా మంచు మనోజ్ చేస్తున్న పనులు చూస్తుంటే అతను మళ్లీ కుటుంబంతో బంధం కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అసలు విషయం ఏంటంటే.. ఇటీవల మంచు విష్ణు పుట్టినరోజు జరుపుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే విష్ణు పుట్టినరోజు సందర్భంగా.. జంబలకడి జారు మిఠాయా సాంగ్ పాడించి మరి మంచు మనోజ్ విష్ణుకు విషెస్ చెప్పించాడు. అయితే విష్ణు మాత్రం సోషల్ మీడియా వేదికగా తనకు విష్ చేసిన వారందరికీ థాంక్స్ అని చెప్పుకున్నాడు కానీ తమ్ముడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపలేదు.
ఇక ఈరోజు మంచు విష్ణు కుమార్తెలు అరీయాన, వివియానా పుట్టినరోజు. వీరిద్దరి పుట్టినరోజు సందర్భంగా.. మంచు మనోజ్ బాబాయిగా వీరిద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి కూడా మంచు కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
Manchu Manoj: మంచు మనోజ్ ను దూరం పెడుతున్న మంచు ఫ్యామిలీ..
దీన్ని బట్టి చూస్తే.. మనోజ్ దగ్గర అవ్వాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నా మంచు కుటుంబం మాత్రం ఇతన్ని దూరంగా పెడుతుందని అందరూ చెప్పుకుంటున్నారు. ఇక మరికొందరు ఏమో అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలోనే మాట్లాడుకోవాలా? బయట మాట్లాడుకుంటారేమో లేదా ఇంట్లో మాట్లాడుకుంటారేమో అని చెప్పుకొస్తున్నారు. అయితే ఇక ఈ వార్తల్లో ఉన్న నిజం ఎంతో బయటపడాల్సి ఉంది.