Manchu Manoj: ఇన్నాళ్లు ముసుగులో గుద్దులాటగా ఉన్న మంచు సోదరుల మధ్య వివాదం ఇప్పుడు రచ్చకెక్కింది. రెండు రోజుల క్రితం విష్ణు తన సోదరుడి ఇంటికి వెళ్లి మనోజ్ మనిషి పై దాడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని మనోజ్ సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
ఇళ్లల్లోకి వచ్చి ఇలా కొడుతుంటారు మా వాళ్లని, బంధువులను.. ఇది సిట్యుయేషన్ అంటూ తన ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశాడు మనోజ్. అయితే అటు విష్ణు ఇటు మోహన్ బాబు ఇద్దరూ పాజిటివ్ గా తీసుకున్నారు. కానీ వీడియో షేర్ చేసిన మనోజ్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
తండ్రి మందలింపు మేరకు ఆ వీడియోని తర్వాత డిలీట్ చేశాడు మనోజ్. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి పట్టించుకోవలసిన అవసరం లేదు అంటూ మోహన్ బాబు స్టేట్మెంట్ ఇచ్చారు. అన్నదమ్ముల మధ్య విభేదాలు తొలగించేందుకు అటు మోహన్ బాబు ఇటు మంచు లక్ష్మి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా మనోజ్ దివంగత నటుడు శ్రీహరి కొడుకు మెగాన్ష్ కొత్త సినిమా ఓపెనింగ్ కి అతిధిగా వెళ్లారు. అక్కడ తన అన్న విష్ణు గురించి స్పందించమని విలేకరులు కోరగా.. నన్ను అడగకండి ఇలాంటి విషయాలు నాకన్నా మీకే బాగా తెలుసు అని తప్పించుకున్నాడు. అయితే తనకి సినిమాలే జీవితమని త్వరలోనే వాట్ ఇస్ ద ఫిష్ మూవీతో మీ ముందుకి వస్తున్నానని. అందుకు అందరి మద్దతు కావాలని తెలిపాడు.
Manchu Manoj:
కొత్తగా జీవితాన్ని ప్రారంభించామని అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలని, మాకు సంతోషకరమైన జీవితాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను అంటూ ముగించాడు మనోజ్. తన భార్య రాజకీయాల్లోకి వస్తానంటే తనకి ఎలాంటి అభ్యంతరము లేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ అన్నదమ్ముల వివాదం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు.