Manchu Manoj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలో మంచు వారి ఫ్యామిలీ ఒకటి అని చెప్పాలి.మంచు మోహన్ బాబు సినిమాలపై ఉన్నటువంటి ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం అనంతరం విలక్షణ నటుడిగా, హీరోగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక ఈయన వారసులుగా ఇండస్ట్రీకి మనోజ్ విష్ణు లక్ష్మీ ప్రసన్న పరిచయమయ్యారు. వీళ్ళు కూడా ఇండస్ట్రీలో వాళ్లకంటూ ఓ గుర్తింపు పొందడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.
ఇకపోతే మంచు మోహన్ బాబు తాజాగా తన 71వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు ఈ వేడుకలలో భాగంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ రాజకీయ ప్రస్థానం గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.ఇక మోహన్ బాబు 71వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారని తెలియడంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున తమ అభిమాన హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక మోహన్ బాబు కుమారుడు హీరో మంచు మనోజ్ సైతం సోషల్ మీడియా వేదికగా తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Manchu Manoj: తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పిన మనోజ్…
మనోజ్ తాజాగా భూమా మౌనికను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే భూమా మౌనికను మోహన్ బాబు ఆశీర్వదిస్తున్నటువంటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… నడక నుంచి నడవడిక వరకు నేర్పించిన నాన్నకు జన్మదిన శుభాకాంక్షలు లవ్ యు నాన్న అంటూ ఈయన ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో పలువురు అభిమానులు కూడా మోహన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే ఈయన తాజాగా వాట్ ది ఫిష్ అనే సినిమాను ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.