Manchu Manoj: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో మంచు మనోజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి మోహన్ బాబు హోదాతో సిని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తొలిసారిగా ఈయన 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించాడు.
చాలా వరకు తన నటనకు మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా స్టార్ హోదాకు మాత్రం చేరుకోలేకపోయాడు. ఇక కొన్ని సినిమాలలో ఫ్లాప్ లు కూడా అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అంతగా అవకాశాలు అందుకోవటం లేదు. ఇక గత కొన్ని రోజుల నుండి ఈయన వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఈయన 2015 మే లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకోగా తనకు విడాకులు ఇచ్చేసి దూరంగా బతుకుతున్నాడు.
ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు. అప్పుడప్పుడు ఈయన చేసే ట్వీట్ లు బాగా వైరల్ అవుతుంది. అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా అయినా ఒక ట్వీట్ పెట్టగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది. తను నటించిన సినిమాల్లోని పాటకు సంబంధించిన జిఫ్ వీడియో షేర్ చేస్తూ.. ‘నా హృదయానికి చేరువైన ఓ ప్రత్యేకమైన వార్తను గత కొంతకాలంగా నాలోనే దాచుకొని ఉన్నాను.
జీవితంలోని మరో దశలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 20న ప్రకటిస్తాను. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు కావాలి అంటూ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేయగా ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన ట్వీట్ చూసిన నెటిజన్స్ అసలు ఏం విషయం చెబుతారు అన్నదానిపై ఆలోచనలో పడ్డారు.
Manchu Manoj:
ఇక కొందరు అన్న నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా అంటూ అనుమానంగా అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకుంటున్నట్లు గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన పెళ్లి గురించి ప్రకటిస్తున్నాడేమో అని అందరూ అనుమాన పడుతున్నారు.