Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి అంటూ ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. అయితే ఈరోజు ఈ విభేదాలు ఒక్కసారిగా బయటపడటంతో ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.మోహన్ బాబు కుమారులు విష్ణు మనోజ్ మధ్య గత కొన్ని రోజులుగా విభేదాల కారణంగా ఇద్దరు మధ్య మాటలు లేవని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పెళ్లి వేడుకలలో విష్ణు ఒక అతిథి లాగా వచ్చి వెళ్లిపోయారు. అలాగే మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలకు కూడా విష్ణు దూరంగా ఉన్నారు. ఇలా వీరిమధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు రాగా తాజాగా ఈ వార్తలు నిజమేనని తెలుస్తోంది.
విష్ణు మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి సారధిపై దాడి చేశారు. అలాగే విష్ణు పై దాడికి ప్రయత్నం చేశారు. అయితే సారధి కుటుంబ సభ్యులు విష్ణును అడ్డుకున్నారు. ఇక మనోజ్ ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా తమ బంధువులు స్నేహితుల ఇళ్లకు వెళ్లి కూడా దాడి చేస్తున్నారంటూ ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారడంతో ఇద్దరు మధ్య విభేదాలకు కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.అయితే ఈ విషయంపై మోహన్ బాబు కల్పించుకొని మనోజ్ కి సర్ది చెప్పడం కాకుండా ఇలా కుటుంబ పరువు సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి అని మందలించినట్టు తెలుస్తుంది. మోహన్ బాబు చెప్పడం వల్లే ఆయన ఈ వీడియోని డిలీట్ చేశారు.
Manchu Vishnu:ఇది చిన్న గొడవే…
ఇక ఈ వీడియో మనోజ్ డిలీట్ చేస్తే లోపే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వీడియో పై మంచు విష్ణు స్పందించారు. ఇది నిన్న జరిగిన గొడవ మా ఇద్దరి మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగడం సర్వసాధారణం. నేను సారధితో గొడవ పడుతుంటే ఆ గొడవ ఆపకుండా మనోజ్ ఇలా వీడియో తీస్తూ కూర్చున్నారు. ఇది మా మధ్య తరచూ జరిగే గొడవనే దీనిని మీరు భూతద్దంలో పెట్టి చూడకండి. మనోజ్ చిన్నవాడు ఏదో తెలిసి తెలియక ఆవేశంలో ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటి గురించి మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ విష్ణు ఈ వీడియో పై స్పందించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విష్ణు మాటలను బట్టి చూస్తే ఈ వీడియోని వీరు లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది.