Manchu Vishnu: గత ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించాడు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమా ఎన్నో అవార్డులు కూడా దక్కించుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకొని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన ఘనత రాజమౌళికి దక్కింది.
తెలుగు సినిమా మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డు గెలవడంతో ఆస్కార్ విన్నర్స్ ని టాలీవుడ్ సన్మానించుకుంది. తాజాగా నిర్వహించిన ఈ వేడుకకు టాలీవుడ్ కి చెందిన అన్ని విభాగాల ప్రతినిధులు, చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రధాన విభాగాల్లో ఒకటైన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తరఫున వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో మాదాల రవి ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి అభినందనలు తెలిపారు.
Manchu Vishnu:
అంతే కాకుండా మంచు విష్ణు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి గల కారణం గురించి కూడా వేదికపై తెలియజేయారు. ప్రస్తుతం మంచు విష్ణు కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉండటంవల్ల ఈ సన్మాన కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని మాదాల రవి తెలుపుతూ.. మంచు విష్ణు తరపున ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి అభినందనలు తెలియచేశాడని సమాచారం. అంతే కాకుండా ఈ వేడుకకు మంచు విష్ణు తో పాటు ఆర్ ఆర్ ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా హాజరకాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ భార్యతో కలిసి దుబాయ్ లో ఉండగా.. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.