Manchu Vishnu Vs Manoj: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంజు కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. అలాగే మోహన్ బాబు వారసులు ముగ్గురు కూడా ఇండస్ట్రీలో రాణించటానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన గుర్తింపు మాత్రం లభించలేదు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు మంచు విష్ణు, ఆయన భార్య వెరానికా అతిదుల్లాగా వచ్చి వెళ్లిపోయారు.
దీంతో మనోజ్ విష్ణు మధ్య మనస్పర్ధలు ఉన్నాయన్న వార్తలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా మంచు విష్ణు మనోజ్ అనుచరుల మీద దాడికి దిగాడు. అందుకు సంబంధించిన వీడియో మంచు మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అన్నదమ్ముల మధ్య ఇలా గొడవ జరగడానికి మౌనిక రెడ్డి కారణమని, మనోజ్ మౌనికని వివాహం చేసుకోవడం వల్లే మనోజ్, విష్ణు మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన మోహన్ బాబు ఇద్దరు కొడుకుల మధ్య రాజీ చేసి వీడియో డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
Manchu Vishnu Vs Manoj: ఎలాంటి గొడవలు లేవు…
ఇక మంచు లక్ష్మిని ఈ వార్తల గురించి ప్రశ్నించగా.. ఈ గొడవ గురించి తనకు తెలియదని, అలాంటప్పుడు ఈ వార్తలపై తాను ఎలా స్పందించగలను అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా మోహన్ బాబు భార్య నిర్మల ఈ వివాదం గురించి స్పందించింది. తన కుమారులు మనోజ్ విష్ణు మధ్య ఎటువంటి గొడవలు జరగలేదని తెలిపింది. అయితే గత రెండు రోజులుగా మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య గొడవ జరిగిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.