Mani Ratnam : కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్ గా మణిరత్నంకి ఎంతటి పాపులారిటీ ఉందో అందరికీ తెలిసందే. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ఒకే ఒక్క సినిమా గీతాంజలి.

అక్కినేని నాగార్జునను ఈ సినిమాలో చాలా డిఫ్రెంట్ మోకోవర్‌తో చూపించారు. మ్యూజికల్ గా ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. అప్పటి వరకు నాగార్జున చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు నాగార్జున కెరీర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అయితే మణిరత్నం ఇండస్ట్రీలో ఎవరి వద్ద అసిస్టెంట్ గా పనిచేయలేదు.

ఇండస్ట్రీకి ఎవరొచ్చినా పెద్ద దర్శకుల వద్ద కొన్నేళ్ళు దర్శకత్వ విభాగంలో పనిచేసి ఆ తర్వాత దర్శకుడిగా మారతారు. కానీ మణిరత్నం ఎవరి వద్ద అలా పనిచేయలేదు. కన్నడలో మొదటి
సినిమాను తెరకెక్కించాడు. ముందునుంచి మంచి టీమ్ ని తీసుకోవడంతో ఇండస్ట్రీలో సెటిలవగలిగారు. తమిళంలో ఆయన తీసిన మొదటి సినిమా పాగల్ నిలవు. ఒక కన్నడ, ఒక మలాయళ సినిమా తర్వాత మూడవ సినిమా తమిళంలో చేశారు. మౌన రాగంతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన నాయకన్ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. గీతాంజలి, అంజలి, దళపతి, రోజా, బొంబాయి, దిల్ సే వంటి సినిమాలతో సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం పేరు మార్మోగిపోయింది.

అయితే గత కొంతకాలంగా మణిరత్నం కి భారీ హిట్ దక్కడం లేదు. తమిళం, హిందీలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. అయినా ఆయన లెజెండరి డైరెక్టర్ గా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ సినిమా చేస్తున్నాడు. పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరక్కిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియ సినిమాగా అన్నీ సౌత్ భాషలలో అలాగే హిందీలో రిలీజ్ చేయనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్, అమితాబ్, ఐశ్వర్యరాయ్, త్రిష, నయనతార, విజయ్ సేతుపతి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు, జయరామ్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.

మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఇంకా 610 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా థాయ్ లాండ్, మధ్యప్రదేశ్, కేరళ లాంటి రియల్ లొకేషన్లలో చిత్రీకరణ జరపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 18, 2021 at 9:57 ఉద.