Manoj Wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పను అవసరం లేదు. ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. అలాగే ఆయన పిల్లలు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి వివాహ వేడుక చాలా ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో మంచు కుటుంబ సభ్యులతో పాటు భూమా మౌనిక రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి వివాహ వేడుక ఫిలింనగర్లోని మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది.
అయితే మంచు వారసుడి పెళ్లి ఇలా సింపుల్ గా ఇంట్లో జరగటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే యువతిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వివాహం జరిగిన కొంతకాలానికి ఆమెతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని ఒకరికొకరు దూరం అయ్యారు. మొదటి భార్యకు దూరమైన తర్వాత మనోజ్ చాలాకాలం ఒంటరిగానే ఉన్నాడు. ఆ తర్వాత తన స్నేహితురాలైన భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి కుటుంబ సభ్యులకు చెప్పగా వారు మాత్రం ఈ పెళ్లికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
Manoj Wedding:
మనోజ్ పై ప్రేమతోనే మంచు లక్ష్మి పెళ్లి బాధ్యతలు తీసుకుందా..
అయితే మనోజ్ రెండవ పెళ్లి గురించి మంచు లక్ష్మి అతనికి అండగా ఉన్నట్లు సమాచారం. తానే దగ్గరుండి మంచు మనోజ్, భూమ మౌనిక రెడ్డి వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు చూసుకున్నట్లు తెలుస్తోంది. అందువల్ల మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి రెండవ వివాహం మంచు లక్ష్మి తన ఇంట్లోనే జరిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహ వేడుకలలో మొదటి నుండి మంచు కుటుంబం కనిపించకపోవడంతో వారు పెళ్లికి హాజరుకారని వార్తలు వినిపించాయి. కానీ మార్చి మూడవ తేదీ రాత్రి 8: 30 నిమిషాలకు జరిగిన మంచు మనోజ్ వివాహ కార్యక్రమానికి మోహన్ బాబు ఆయన సతీమణి, విష్ణు- విరోనిక కూడా హాజరయ్యారు. దీంతో కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో మంచు మనోజ్ తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.