Mantri Roja: తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన రోజా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది రోజా. తన అందాలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హోదాను సొంతం చేసుకుంది. ఇక వయసు మీద పడుతున్న కొద్ది కొన్ని సహాయక పాత్రలలో నటించింది.
ఇక గత కొంతకాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో లో మొన్నటి వరకు జడ్జిగా బాధ్యతలు చేపట్టింది. ఎప్పుడైతే మంత్రి బాధ్యతలు చేపట్టిందో అప్పటినుంచి జబర్దస్త్ కూడా దూరమైంది. ఇక జబర్దస్త్ లో ఉన్నంతకాలం రోజా తన ఆటపాటలతో బాగా సందడి చేసింది. షో ఎంట్రీ తోనే ఏదో ఒక డాన్స్ స్టెప్ తో బాగా సందడి చేసేది.
ప్రస్తుతం నటనకు, జడ్జి బాధ్యతలకు దూరంగా ఉన్నా కూడా తనకిష్టమైన డాన్స్ లు మాత్రం మంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా వదలట్లేదు. ప్రస్తుతం రోజా ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వార్తల్లో ప్రతి రోజు నిలుస్తుంది. ఏదో ఒక విషయంతో అందరి దృష్టిలో పడుతుంది.
అంతేకాకుండా అప్పుడప్పుడు పలు వివాదాల్లో కూడా ఇరుకుతుంది. ప్రతిపక్షాలపై బాగా కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓ వివాదంలో ఇరికింది. పర్యటక శాఖ మంత్రి అయిన ఈమె తాజాగా బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ కు వెళ్ళింది. ఇక అక్కడి మత్స్యకారులు, పర్యాటకులతో మాట్లాడింది. ఆ తర్వాత సముద్రంలోకి దిగి కాసేపు నీళ్లతో ఆడింది.
Mantri Roja:
అయితే ఆమె సముద్రంలోకి దిగే సమయంలో ఆమె చెప్పులను ఓ ప్రభుత్వ ఉద్యోగి పట్టుకోవడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె తన చెప్పులు ఆ ఉద్యోగికి అలా అప్పజెప్పడంతో.. ఆమె ప్రవర్తన పట్ల అందరూ ఫైర్ అవుతున్నారు. ఎంత మంత్రి హోదాలో ఉన్న కూడా.. ఇంతలా ప్రవర్తించొద్దు అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.