Upasana: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు మంచి గుర్తింపు సంపాదించుకొని స్టార్ సక్సెస్ అందుకున్నారు అయితే ఇలా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో మెగా హీరోలు అధికంగా ఉన్నారని చెప్పాలి. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి వారందరూ కూడా విపరీతమైనటువంటి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి హీరోలు అని చెప్పాలి. ఇలా స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి వీరందరూ కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నప్పటికీ ఉపాసనకి మాత్రం ఈ మెగా హీరోలు అంటే ఎవరు ఇష్టం లేదని తెలుస్తుంది.
ఉపాసన మొదటి నుంచి కూడా సినిమాలు చాలా తక్కువగా చూసేవారని తెలుస్తుంది. అయితే ఈమె చూసే సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ అందులో మాత్రం ఎప్పుడూ కూడా ఒక హీరో సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారట మరి ఈమెకు ఇష్టమైనటువంటి హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఉపాసనకు మెగా హీరోలు అంటే ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. ఈమె టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి విక్టరీ వెంకటేష్ కి అభిమాని అని తెలుస్తుంది. వెంకటేష్ నటన ఆయన ఎంపిక చేసుకునే సినిమాలు అంటే ఉపాసనకు చాలా ఇష్టమట.
వెంకటేష్ అంటే అంత ఇష్టమా…
ఈ విధంగా వెంకటేష్ నటించిన సినిమాలంటే ఉపాసనకు ఎంతో ఇష్టం ఉండడంతో ఆయన అంటేనే చాలా ఇష్టమని ఇప్పటికీ వెంకటేష్ సినిమాలు వస్తే చూస్తూ ఉంటారని తెలియజేయడంతో ఈ వార్త కాస్త వైరల్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో ఇంతమంది మెగా హీరోలు ఉన్నప్పటికీ ఉపాసనకు వెంకటేష్ అంటే ఇష్టమని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక మరి కొంతమంది ఈ విషయంపై స్పందిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరో అయినా తన భర్త రామ్ చరణ్ నటించిన కూడా ఉపాసనకు నచ్చదా అంటూ కామెంట్లు చేయగా ఇది నిజంగానే మెగా హీరోలకు అవమానం అంటూ మరికొందరు ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు.