Pokiri Climax : పోకిరి సినిమా తెలుసు కదా. అప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టిన మూవీ అది. అప్పట్లో ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను మరే సినిమా చేయలేదు. పూరి జగన్నాథ్, మహేశ్ బాబు కెరీర్ లోనే ది బెస్ట్ హిట్ మూవీ అది. మహేశ్ కు అయితే ఆ సినిమా బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. మాస్ హీరోగా మహేశ్ బాబును మార్చిన మూవీ అది. ఆ తర్వాత మహేశ్ కెరీర్ కూడా బీభత్సంగా దూసుకుపోయింది.
అప్పట్లోనే ఆ సినిమా 50 కోట్లు కలెక్ట్ చేసింది. నిజానికి ఆ సినిమా అంతలా సూపర్ సక్సెస్ అవుతుందని మూవీ యూనిట్ కూడా ఊహించలేదు. ఏదో సినిమా తీశారు. మామూలుగా నడుస్తుంది అని అనుకున్నారు కానీ.. ఇంతలా ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు. అయితే.. ఈ సినిమా క్లైమాక్స్ తీశాక ఆ సినిమా క్లైమాక్స్ చూసి బాగోలేదు.. మార్చాలి లేకపోతే సినిమా ఆడదు అని డైరెక్ట్ గా పూరీకే ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేశ్ చెప్పారట.
Pokiri Climax : ముందు వేరే క్లైమాక్స్ అనుకున్నారట పూరీ
నిజానికి ఈ సినిమాకు ముందు వేరే క్లైమాక్స్ అనుకొని షూటింగ్ కూడా జరిపారట. కానీ.. ఆ సినిమాను ఎడిట్ చేసిన మార్తాండ్ కే వెంకటేశ్ దాన్ని మార్చాలని చెప్పడంతో మహేశ్ బాబు పోలీస్ అనే విషయాన్ని చివర్లో రివీల్ చేసి ఆ తర్వాత క్లైమాక్స్ ను ప్లాన్ చేశారు పూరీ జగన్నాథ్. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ పూర్తయ్యే వరకు సినిమా కన్ను ఆర్పకుండా చూసేలా చేస్తుంది ప్రేక్షకులను. అందుకే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒకవేళ మార్తాండ్ కే వెంకటేశ్ చెప్పినట్టుగా వినకుండా పూరీ.. తను ముందు అనుకున్న క్లైమాక్స్ తోనే సినిమా తీసి ఉంటే.. సినిమా అట్టర్ ఫ్లాప్ అయి ఉండేది కావచ్చు.